నేడు హెచ్‌ఐసీసీలో ఐఏఎంసీ సదస్సు

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో శనివారం ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) సదస్సు జరగనుంది. దీనికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరై కీలక

Published : 04 Dec 2021 05:21 IST

హాజరుకానున్న సుప్రీంకోర్టు సీజేఐ, సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో శనివారం ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) సదస్సు జరగనుంది. దీనికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరై కీలక ప్రసంగాలు చేస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ స్వాగతోపన్యాసం, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వర్‌రావు అధ్యక్షోపన్యాసమిస్తారు. సదస్సు అనంతరం రెండు ప్యానెల్‌ల చర్చాగోష్ఠులుంటాయి. ఆల్టర్నేటివ్‌ డిస్ప్యూట్‌ రిజల్యూషన్‌(ఏడీఆర్‌) ప్రక్రియపై జరిగే చర్చకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ పాత్రపై జరిగే చర్చకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి నేతృత్వం వహిస్తారు. చర్చాగోష్ఠుల ముగింపు కార్యక్రమాల్లో మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని