జీవో 317పై పోరాటం

జీవో 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతూ దశలవారీగా ఆందోళన చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిర్ణయించింది. ఈ జీవోతో ఉత్పన్నమైన సమస్యలను సీఎంకు

Published : 23 Jan 2022 04:32 IST

ఫిబ్రవరి 5న హైదరాబాద్‌లో మహాధర్నా

ఈనాడు, హైదరాబాద్‌: జీవో 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతూ దశలవారీగా ఆందోళన చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిర్ణయించింది. ఈ జీవోతో ఉత్పన్నమైన సమస్యలను సీఎంకు వివరించడంలో అధికారులు, కొందరు సంఘాల నాయకులు విఫలం చెందారంది. తమ ప్రతినిధులకు అపాయింట్‌మెంట్‌ ఇస్తే సమస్యలను వివరించి వాటి పరిష్కారాలను సూచిస్తామంది. శనివారం స్టీరింగ్‌ కమిటీ జూమ్‌ సమావేశం జరిగింది. ‘‘దశలవారీ పోరాటాలలో భాగంగా సీఎం అపాయింట్‌మెంట్‌ కోసంఈనెల 23న లేఖరాస్తాం. 24న రాజకీయ పక్షాల నేతలతో ములాఖత్‌, 25, 26, 27 తేదీల్లో జిల్లాల్లో సన్నాహక సదస్సులు నిర్వహిస్తాం. 29న కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శనలుంటాయి. ఫిబ్రవరి 5న హైదరాబాద్‌లో మహాధర్నా చేపడతాం’’ అని కమిటీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని