Published : 02/12/2021 08:30 IST

TS News: సాగులో సాగలేం.. మా భూమి అద్దెకిస్తాం

పెద్దపల్లి జిల్లా మంథని మండలం పుట్టపాకలో పొలం లీజుకు ఇస్తానంటూ ఓ రైతు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

సాగు సమస్యలు అన్నదాతలను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. హలాలు పట్టి పొలాలు దున్ని వరిసాగు చేస్తే కొనుగోలు ఉండకపోతే ఎలా అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ వరికి బదులు మక్క, పెసర, మినుము, పొద్దుతిరుగుడు వంటి పంటలు వేస్తే కోతులు, అటవీ జంతువులు, పక్షుల నుంచి పంటను రక్షించుకోగలుగుతామా అనే సంశయంలో కొట్టుమిట్టాడుతున్నారు. భూములను కౌలుకు తీసుకొని సాగుచేస్తున్న అనేకమంది కౌలు రైతులు ఇప్పటికే సాగు చేయలేమంటూ వాటిని యజమానులకు అప్పగించేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కొంతమంది కర్షకులు తమ భూములను లీజుకు ఇవ్వడం కోసం ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆరుతడి పంటలకు, పాడి పరిశ్రమలకు లేదా ఇతర అవసరాలకు భూములను లీజుకు ఇస్తామంటూ పెద్దపల్లి, మంథని, రామగిరి, రామగుండం ప్రాంతాల్లో అక్కడక్కడ ఇలా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి.

- యైటింక్లయిన్‌కాలనీ, న్యూస్‌టుడే

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని