Delhi: దిల్లీ శిబిరంలో మరో కొవిడ్‌ కేసు.. పంజాబ్‌తో దిల్లీ మ్యాచ్‌ వేదిక మార్పు

దిల్లీ జట్టులో మరో కొవిడ్‌ కేసు బయటపడింది. ఇప్పటికే ఆ జట్టు ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌తో పాటు ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హార్ట్‌, మసాజర్‌ చేతన్‌ కుమార్‌, వైద్యుడు అభిజిత్‌ సాల్వి పాజిటివ్‌గా

Updated : 20 Apr 2022 08:32 IST

ముంబయి: దిల్లీ జట్టులో మరో కొవిడ్‌ కేసు బయటపడింది. ఇప్పటికే ఆ జట్టు ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌తో పాటు ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హార్ట్‌, మసాజర్‌ చేతన్‌ కుమార్‌, వైద్యుడు అభిజిత్‌ సాల్వి పాజిటివ్‌గా తేలడం తెలిసిందే. వీరితో పాటు దిల్లీ జట్టు సోషల్‌ మీడియా టీం సభ్యుడైన ఆకాశ్‌ మానె కూడా కొవిడ్‌ బారిన పడ్డట్లు వెల్లడైంది. ఒక్క రోజు వ్యవధిలో కొత్తగా నాలుగు కొవిడ్‌ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో బుధవారం పంజాబ్‌ తో డీసీ మ్యాచ్‌ వేదిక మారింది. ఈ మ్యాచ్‌ పుణెలోని ఎంసీఏ స్టేడియం జరగాల్సి ఉండగా.. వేదికను ముంబయిలోని బ్రబౌర్న్‌ స్టేడియానికి మారుస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దిల్లీ శిబిరంలో కొవిడ్‌ కేసుల నేపథ్యంలో సోమవారం ముంబయి నుంచి పుణెకు ఆ జట్టు ప్రయాణం వాయిదా పడింది. ఈ పరిస్థితుల్లో పుణెకు ప్రయాణం మంచిది కాదన్న ఉద్దేశంతో అక్కడ జరగాల్సిన మ్యాచ్‌ను ముంబయికి మార్చారు. గత మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓటమికి తోడు.. జట్టులో ఒకేసారి ఇన్ని కొవిడ్‌ కేసులు బయటపడటం దిల్లీ  ఆత్మస్థైర్యాన్ని కొంత దెబ్బ తీసేదే. ఈ నేపథ్యంలో పంజాబ్‌తో మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ సేన ఎలాంటి ప్రదర్శన చేస్తుందన్నది ఆసక్తికరం. పంజాబ్‌ సైతం.. గత మ్యాచ్‌లో హైదరాబాద్‌ చేతిలో ఓడి, దిల్లీపై పుంజుకోవాలన్న పట్టుదలతో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని