Ravichandran Ashwin: భారత టీ20 లీగ్‌ చరిత్రలో అశ్విన్‌ తొలి రిటైర్డ్‌ ఔట్‌

వాంఖడే వేదికగా గతరాత్రి లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ టోర్నీ చరిత్రలో రిటైర్డ్‌ ఔటైన తొలి ఆటగాడిగా నిలిచాడు...

Published : 11 Apr 2022 10:13 IST

(Photo: Ravichandran Ashwin Instagram)

ముంబయి: వాంఖడే వేదికగా గతరాత్రి లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ టోర్నీ చరిత్రలో రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా నిలిచాడు. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో అతడు ఇలా పెవిలియన్‌ చేరాడు. అలసిపోయి షాట్లు ఆడలేకపోతుండటంతో అశ్విన్‌ వెనుదిరిగి ఉండొచ్చని తెలుస్తోంది. రిటైర్డ్‌ ఔట్‌ అనేది ఓ వ్యూహాత్మక ఎత్తుగడ. మెరుగైన ముగింపు కోసం రాజస్థాన్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. రిటైర్డ్‌ హర్ట్‌ అయిన బ్యాటర్‌లా.. రిటైర్డ్‌ ఔట్‌ అయిన బ్యాటర్‌ తిరిగి బ్యాటింగ్‌ రావడానికి వీల్లేదు. అశ్విన్‌ స్థానంలో క్రీజులోకి వచ్చిన పరాగ్‌ ఓ సిక్స్‌ కొట్టడం గమనార్హం. చివరికి రాజస్థాన్‌ 20 ఓవర్లకు 165/6 స్కోర్‌ చేసింది. అశ్విన్‌ (28; 23 బంతుల్లో 2x6), షిమ్రన్‌ హెట్‌మయర్‌ (59 నాటౌట్‌; 36 బంతుల్లో 1x4, 6x6) పరుగులు చేశారు. అనంతరం ఛేదనకు దిగిన లఖ్‌నవూ 20 ఓవర్లకు 162/8 స్కోరుకే పరిమితమైంది. క్వింటన్‌ డికాక్‌ (39; 32 బంతుల్లో 2x4, 1x6), మార్కస్‌ స్టాయినిస్‌ (38 నాటౌట్‌; 17 బంతుల్లో 2x4, 4x6) గెలిపించే ప్రయత్నం చేశారు. అయినా, చివరికి రాజస్థాన్‌ 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని