రెడ్‌మీ నుంచి బడ్జెట్‌ ట్యాబ్లెట్‌

రెడ్‌మీ సంస్థ ఇటీవల చవక ట్యాబ్లెట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. పేరు రెడ్‌మీ ప్యాడ్‌. ఫ్లాట్‌ అంచులతో కూడిన ఇది పట్టుకున్నప్పుడు ప్రీమియం పరికరం భావన కలిగిస్తుంది.

Published : 19 Oct 2022 00:30 IST

రెడ్‌మీ సంస్థ ఇటీవల చవక ట్యాబ్లెట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. పేరు రెడ్‌మీ ప్యాడ్‌. ఫ్లాట్‌ అంచులతో కూడిన ఇది పట్టుకున్నప్పుడు ప్రీమియం పరికరం భావన కలిగిస్తుంది. 10.6 అంగుళాల ఎల్‌సీడీ తెర, 2000/1200 పిక్సెల్స్‌ రెజల్యూషన్‌, 400 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో ఆకర్షణీయంగా ముస్తాబైంది. నీరు, దుమ్మును తట్టుకునే విషయంలో ఐపీ52 ర్యాంకు సొంతం చేసుకుంది. నాలుగు డైనమిక్‌ స్పీకర్లతో నాణ్యమైన సౌండ్‌ను అందిస్తుంది. అయితే హెడ్‌ఫోన్‌ జాక్‌ లేదు. ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ కూడా లేదు. 90 హెచ్‌జెడ్‌ గరిష్ఠ రిఫ్రెష్‌ వేగం ఉండటం వల్ల మంచి అనుభూతి కలుగుతుంది. దీని 8000 ఎంఏహెచ్‌ బ్యాటరీ రోజంతా వీడియో ప్లేబ్యాక్‌ చేయటానికీ ఉపయోగపడుతుంది. ఇది 18 వాట్ల వేగంతో ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ జీ99 చిప్‌సెట్‌తో కూడుకున్న దీంతో ఒకేసారి వివిధ పనులు చేసుకోవచ్చు. హెవీ డ్యూటీ గేమ్స్‌నూ ఆడుకోవచ్చు. కాకపోతే దీనికి సిమ్‌ కార్డు స్లాట్‌ లేదు. వైఫైతోనే కనెక్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 8ఎంపీ కెమెరా ఉంది. 1080పీ వీడియోలను 30ఎఫ్‌పీఎస్‌తో రికార్డు చేసుకోవచ్చు. ముందు కెమెరాకూ 8ఎంపీ సెన్సర్‌ ఉంది. వీడియోకాల్‌ చేసుకోవటానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ర్యామ్‌, స్టోరేజీలను బట్టి మూడు రకాల్లో అందుబాటులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు