ఇక ఉచిత డ్రైవ్‌ స్టోరేజీ 1 టీబీ

డ్రైవ్‌ వాడేవారికి శుభవార్త. ఉచిత స్టోరేజీని గణనీయంగా పెంచనున్నట్టు గూగుల్‌ ప్రకటించింది. ప్రస్తుతం డ్రైవ్‌లో 15జీబీ వరకు ఉచిత స్టోరేజీ లభిస్తోంది.

Updated : 09 Nov 2022 09:58 IST

డ్రైవ్‌ వాడేవారికి శుభవార్త. ఉచిత స్టోరేజీని గణనీయంగా పెంచనున్నట్టు గూగుల్‌ ప్రకటించింది. ప్రస్తుతం డ్రైవ్‌లో 15జీబీ వరకు ఉచిత స్టోరేజీ లభిస్తోంది. త్వరలో ఇది 1టీబీకి పెరగనుంది. వ్యక్తిగత గూగుల్‌ వర్క్‌స్పేస్‌ ఖాతాదారులందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. దీన్ని పొందటానికి ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదని.. అందరి ఖాతాలు 15జీబీ స్టోరేజీ నుంచి 1టీబీకి వాటంతటవే అప్‌గ్రేడ్‌ అవుతాయని గూగుల్‌ పేర్కొంది. మరో మంచి విషయం- అదనపు స్టోరేజీ అంతా బిల్టిన్‌ రక్షణ వ్యవస్థ కిందికి రావటం. అంటే స్పామ్‌, రాన్సమ్‌వేర్‌ వంటి దాడుల బారిన పడకుండా కాపాడుతుందన్నమాట. డ్రైవ్‌లో పీడీఎఫ్‌, క్యాడ్‌, ఇమేజెస్‌ వంటి 100కు పైగా ఫైళ్లను స్టోర్‌ చేసుకోవచ్చు. వీటిని మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ మీద ఎడిట్‌ చేసుకోవచ్చు కూడా. ఆయా రకాల ఫైళ్లను మార్చుకోవాల్సిన అవసరం లేకుండానే దీన్ని చేసుకోవచ్చు. ప్రీమియం మీట్‌, గూగుల్‌ డాక్స్‌లో ఇసిగ్నేచర్‌, అపాయింట్‌మెంట్‌ షెడ్యూలింగ్‌, జీమెయిల్‌లో ఫ్లెక్సిబుల్‌ లేఅవుట్ల వంటి కొత్త ఫీచర్లను పరిచయం చేయటానికీ గూగుల్‌ ప్రయత్నిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని