ఇయర్‌ఫోన్లతో జాగ్రత్త!

ఇప్పుడు ఎవరి చెవుల్లో చూసినా ఇయర్‌ఫోన్లే. లేదూ ఇయర్‌బడ్స్‌, హెడ్‌ఫోన్లే. సంగీతం వినటం.. సినిమాలు, వినోద కార్యక్రమాలకు చూడటం ఎవరికి ఇష్టముండదు? ప్రయాణాలు చేస్తున్నప్పుడు మంచి కాలక్షేపం కూడా. కానీ ప్రతిదానికీ ఒక పరిమితి ఉంటుంది.

Published : 23 Nov 2022 00:47 IST

ప్పుడు ఎవరి చెవుల్లో చూసినా ఇయర్‌ఫోన్లే. లేదూ ఇయర్‌బడ్స్‌, హెడ్‌ఫోన్లే. సంగీతం వినటం.. సినిమాలు, వినోద కార్యక్రమాలకు చూడటం ఎవరికి ఇష్టముండదు? ప్రయాణాలు చేస్తున్నప్పుడు మంచి కాలక్షేపం కూడా. కానీ ప్రతిదానికీ ఒక పరిమితి ఉంటుంది. మనం వినే చప్పుడుకూ ఇది వర్తిస్తుంది. ఇయర్‌ఫోన్ల వంటి సాధనాలతో హై వాల్యూమ్‌తో వినే అవకాశం చాలా ఎక్కువ. ఇది వినికిడిని దెబ్బతీస్తుంది. యుక్తవయసు పిల్లలు, యువతీ యువకుల్లో (12-34 ఏళ్లు) దాదాపు 24% మంది మితిమీరిన వాల్యూమ్‌తోనే సంగీతాన్ని వింటున్నారని అంతర్జాతీయ పరిశోధకుల బృందం గుర్తించింది. దీంతో దాదాపు 100 కోట్ల మంది వినికిడి లోపం బారినపడే ప్రమాదముండటం గమనార్హం. ఎక్కువ శబ్దంతో ఒకసారి విన్నా, మాటిమాటికి విన్నా చెవుల్లో వినికిడి వ్యవస్థ దెబ్బతింటుంది. చెవుల్లో రింగు మనే మోత వినిపించొచ్చు. వినికిడి తీరూ మారిపోవచ్చు. చిన్న వయసులో వినికిడి వ్యవస్థ దెబ్బతింటే వయసుతో పాటు తలెత్తే వినికిడి లోపం ముప్పు మరింత ఎక్కువవుతుంది. కాబట్టి వాల్యూమ్‌ విషయంలో అంతా దృష్టి సారించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని