ప్రో ఫొటో నిపుణులు మీరే

ఐఫోన్ల కెమెరా సామర్థ్యమే వేరు. వీటి ఫొటోల స్పష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రో సిరీస్‌ ఫోన్లయితే మరింత క్వాలిటీతోనూ ఫొటోలు తీస్తాయి.

Published : 14 Dec 2022 01:11 IST

ఐఫోన్ల కెమెరా సామర్థ్యమే వేరు. వీటి ఫొటోల స్పష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రో సిరీస్‌ ఫోన్లయితే మరింత క్వాలిటీతోనూ ఫొటోలు తీస్తాయి. అంతా వీటి ప్రత్యేకమైన హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లు గొప్పతనమే. స్టాండర్డ్‌ రకాలతో ప్రో రకం ఐఫోన్లతో తీసే ఫొటోలు ఇంకాస్త స్పష్టంగా ఉంటాయి. అందుకే వీటిపై అందరికీ అంత ఆసక్తి. మీరూ ఐఫోన్‌ 12 ప్రో, ఐఫోన్‌ 13 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో రకాలను వాడుతున్నట్టయితే సెటింగ్స్‌లో కొన్ని మార్పులు చేసుకొని చూడండి. ఆశ్చర్యపోవటం ఖాయం.


యాపిల్‌ ప్రోరా

ఐఫోన్‌ 12 ప్రో, 12 ప్రో మ్యాక్స్‌, ఐఫోన్‌ 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్‌, ఐఫోన్‌ 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్‌ ఫోన్లలో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంటుంది. ఇది ఆర్‌ఏడబ్ల్యూ ఫార్మాట్‌లో దృశ్యాలను గ్రహిస్తుంది. వీటిని ఎడిట్‌ చేసుకోవచ్చు. ఇష్టమైనట్టుగా కలర్‌ను కరెక్ట్‌ చేసుకోవచ్చు.

* సెటింగ్స్‌ ద్వారా కెమెరాలోకి వెళ్లి ఫార్మాట్స్‌ ఆప్షన్‌లో యాపిల్‌ ప్రోరాను ఎనేబుల్‌ చేసుకోవాలి.


కెమెరా గ్రిడ్‌

ఇది ప్రో రకాల్లోనే కాదు ఇతర ఐఫోన్లలోనూ అందుబాటులో ఉంది. కెమెరా గ్రిడ్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే బాగా ఫ్రేమ్‌ చేసుకోవచ్చు. నైపుణ్యం గల ఫొటోగ్రాఫర్లు తీసినట్టుగా మరింత స్పష్టంగా ఫొటోలు తీసుకోవచ్చు.

* సెటింగ్స్‌ నుంచి కెమెరాలోకి వెళ్లి గ్రిడ్‌ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి.


48ఎంపీ మోడ్‌

ప్రస్తుతానికిది ఐఫోన్‌ 14 ప్రో, 14 ప్రో మ్యాక్స్‌లోనే అందుబాటులో ఉంది. ఈ ఫోన్లతో తీసుకునే 12ఎంపీ ఫొటోలతో పోలిస్తే ఇది మరింత వివరంగా దృశ్యాలను గ్రహిస్తుంది.

* యాపిల్‌ ప్రోరాను ఎనేబుల్‌ చేసుకున్నాక ప్రోరా రిజల్యూషన్‌ మీద క్లిక్‌ చేయాలి. ఇందులో 48ఎంపీని ఎంచుకుంటే హై రిజల్యూషన్‌ ఫొటోలు తీసుకోవచ్చు.


వాల్యూమ్‌-అప్‌ బాస్ట్‌

ఆటలను గానీ కదులుతున్న వాటిని గానీ ఫొటోలు తీయాలంటే ఫాస్ట్‌ షూటింగ్‌ మోడ్‌ తప్పనిసరి. త్వరత్వరగా ఫొటోలు తీయటానికి వాల్యూప్‌ అప్‌ ఫర్‌ బాస్ట్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే చాలా తేలికవుతుంది. ఒక్క వాల్యూమ్‌ బటన్‌ను నొక్కితే చాలు వరుసగా బోలెడన్ని ఫొటోలు తీసుకోవచ్చు.

* సెటింగ్స్‌ ద్వారా కెమెరా విభాగంలోకి వెళ్లి యూజ్‌ వాల్యూమ్‌ అప్‌ ఫర్‌ బాస్ట్‌ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి.


వ్యూ అవుట్‌సైడ్‌ ద ఫ్రేమ్‌

ప్రో ఐఫోన్‌ మోడళ్లలో మరో మంచి ఫీచర్‌ వ్యూ అవుట్‌సైడ్‌ ద ఫ్రేమ్‌. దీన్ని ఎనేబుల్‌ చేసుకుంటే టెలిఫొటో లెన్స్‌ లేదా వైడ్‌-యాంగిల్‌ లెన్స్‌తో ఫొటోలు తీస్తున్నప్పుడూ ఫ్రేమ్‌కు ఆవల ఉన్న దృశ్యాలూ కనిపిస్తాయి. దీంతో కావాల్సినట్టుగా యాంగిల్‌ను మార్చుకోవచ్చు. ఆయా దృశ్యాలను ఫ్రేమ్‌లోకి తీసుకురావచ్చు.

* సెటింగ్స్‌ నుంచి కెమెరా విభాగంలోకి వెళ్లి వ్యూ అవుట్‌సైడ్‌ ద ఫ్రేమ్‌ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని