Google: గూగుల్‌లో ఇవి వెతికితే చిక్కులే!

గూగుల్‌లో దేని గురించైనా వెతకొచ్చు. తేలికగా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కానీ కొన్ని విషయాల గురించి వెతికితే మాత్రం చిక్కులు తెచ్చిపెట్టొచ్చు.

Updated : 04 Jan 2023 10:10 IST

గూగుల్‌లో దేని గురించైనా వెతకొచ్చు. తేలికగా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కానీ కొన్ని విషయాల గురించి వెతికితే మాత్రం చిక్కులు తెచ్చిపెట్టొచ్చు.
* బాంబ్‌ను తయారు చేయటమెలా? ప్రెషర్‌ కుక్కర్‌ బాంబ్‌ను తయారు చేయటమెలా? అని వెతికితే పోలీసులు ఇంటి తలుపు తట్టొచ్చు. సెక్యూరిటీ సర్వీసులు ఇలాంటి హానికర అంశాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తాయి మరి. కాబట్టి వీటి గురించి ఎన్నడూ వెతకొద్దు.

* పిల్లల అశ్లీల చిత్రాలు, పిల్లల లైంగిక వేధింపులతో కూడిన వీడియోలు నేరం కిందికే వస్తాయి. వీటిని చూసినా, డౌన్‌లోడ్‌ చేసినా పోలీసులను ఇంటికి ఆహ్వానించినట్టే.

* నేరాలకు సంబంధించిన ప్రశ్నలను వెతికినా కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. కిడ్నాపింగ్‌, నార్కోటిక్స్‌ వంటి వాటి గురించి వెతికితే పోలీసులు ఇంటికి రావొచ్చు.

* అబార్షన్‌తో ముడిపడిన అంశాలను తరచూ వెతికినా ఇబ్బందే. మనదేశంలో వైద్యపరమైన అబార్షన్‌ విషయంలో కచ్చితమైన నియమాలున్నాయి. వీటిల్లో లోపాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తే పోలీసులు అనుమానించే ప్రమాదముంది.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని