నోట్‌ప్యాడ్‌లోనూ ట్యాబ్స్‌

విండోస్‌ 11లో నోట్‌ప్యాడ్‌ వాడేవారికి శుభవార్త. దీనికి తాజాగా ట్యాబ్స్‌ ఫీచర్‌ను జత చేయనున్నట్టు మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది.

Published : 25 Jan 2023 00:10 IST

విండోస్‌ 11లో నోట్‌ప్యాడ్‌ వాడేవారికి శుభవార్త. దీనికి తాజాగా ట్యాబ్స్‌ ఫీచర్‌ను జత చేయనున్నట్టు మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. ఒకే నోట్‌ప్యాడ్‌ విండోలో వివిధ ఫైళ్లను సృష్టించుకోవటానికి, మేనేజ్‌ చేయటానికిది తోడ్పడుతుంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎడ్జ్‌ వెబ్‌ బ్రౌజర్‌లోని ట్యాబ్స్‌ మాదిరిగానే ఈ నోట్‌ప్యాడ్‌ ట్యాబ్స్‌ ఫీచర్‌ పనిచేస్తుంది. వివిధ నోట్‌ప్యాడ్‌ విండోస్‌ తెరవాల్సిన అవసరం లేకుండానే ఎక్కువ ఫైళ్ల మీద పనిచేసుకోవటానికిది వీలు కల్పిస్తుంది. ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌లో ట్యాబ్స్‌లాగా యాప్‌ మీద కనిపించే ట్యాబ్‌ మీద క్లిక్‌ చేసి ఆయా ఫైళ్లను చూసుకోవచ్చు. నోట్‌ప్యాడ్‌లో ఈ ట్యాబ్స్‌ను మేనేజ్‌ చేసుకోవటానికి కొత్త కీబోర్డు షార్ట్‌కట్స్‌ కూడా ఉండటం విశేషం. సేవ్‌ చేయని ఫైళ్ల కోసం అంశాన్ని బట్టి ఆటోమేటిక్‌గా ఫైల్‌ పేరు జెనరేట్‌ కావటం, సేవ్‌ చేయని మార్పులను సూచించటం వంటి మెరుగులూ దిద్దారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని