ఫైల్ హిస్టరీతో బ్యాకప్!
డాక్యుమెంటో, ఫొటోనో ఉన్నంతవరకు దాని విలువ తెలియదు. పోయినప్పుడే తెలుస్తుంది అవెంత ముఖ్యమైనవో. పీసీ క్రాష్ అవటం, పొరపాటున డిలీట్ చేయటం, హార్డ్‌వేర్ ఫెయిల్ కావటం.. ఇలాంటివన్నీ డాక్యుమెంట్లను కోల్పోయేలా చేసేవే.
డాక్యుమెంటో, ఫొటోనో ఉన్నంతవరకు దాని విలువ తెలియదు. పోయినప్పుడే తెలుస్తుంది అవెంత ముఖ్యమైనవో. పీసీ క్రాష్ అవటం, పొరపాటున డిలీట్ చేయటం, హార్డ్‌వేర్ ఫెయిల్ కావటం.. ఇలాంటివన్నీ డాక్యుమెంట్లను కోల్పోయేలా చేసేవే. అందుకే ఫైళ్లను బ్యాకప్ చేసుకోవటం అత్యవసరం. విండోస్ 10లో దానంతటదే బ్యాకప్ చేసుకునే సదుపాయముంది. దీనికి అదనపు సాఫ్ట్‌వేర్‌ను కొనాల్సిన, ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫైల్ హిస్టరీ ఆప్షన్ ఉపయోగించుకుంటే చాలు. కాకపోతే ఎక్స్‌టర్నల్ స్టోరేజీ డ్రైవ్ అవసరం. చవక యూఎస్‌బీ డ్రైవ్‌తోనైనా బ్యాకప్ చేసుకోవచ్చు. మనం మార్పులు చేసే డాక్యుమెంట్లు, ఫొటోల వంటి వాటిని ఫైల్ హిస్టరీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. దేనినైనా మార్చినప్పుడు రక్షణ కోసం అసలు ప్రతిని దాచి పెడుతుంది. పొరపాటున డాక్యుమెంట డిలీట్ అయితే దాన్ని రీస్టోర్ చేసుకోవచ్చు. అంతకుముందు ఫైళ్ల వర్షన్లు ఎన్ని స్టోర్ కావాలనేదీ బ్యాకప్ పరికరం సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మరి ఫైల్ హిస్టరీ బ్యాకప్‌ను ఎనేబుల్ చేసుకోవటమెలాగో చూద్దామా.
* ముందుగా స్టార్ట్ బటన్‌ను నొక్కి, సెటింగ్స్ గేర్‌ను క్లిక్ చేయాలి. సెటింగ్స్ విభాగంలోకి వెళ్లాక అప్‌డేట్ అండ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేయాలి.
* ఎడమవైపు జాబితాలోని ‘బ్యాకప్’ ఆప్షన్ ద్వారా ‘బ్యాకప్ యూజింగ్ ఫైల్ హిస్టరీ’లోకి వెళ్లాలి. ప్లస్ గుర్తును నొక్కితే అందుబాటులో ఉన్న డ్రైవ్‌ల జాబితా కనిపిస్తుంది. దీనిలోంచి ఎక్స్‌టర్నల్ డ్రైవ్‌ను ఎంచుకోవాలి.
* తర్వాత ‘ఆటోమేటికల్లీ బ్యాకప్ మై ఫైల్స్’ మీటను ఆన్ చేసుకోవాలి. కావాలంటే మోర్ ఆప్షన్స్ ద్వారా ఎప్పుడెప్పుడు బ్యాకప్ కావాలో, అత్యంత ముఖ్యమైనవేంటో కూడా ఎంచుకోవచ్చు.
* అంతే ఫైళ్లు వాటంతటవే బ్యాకప్ అవుతాయి. విండోస్ 10 ఫైల్ హిస్టరీ డిఫాల్ట్‌గా మన డాక్యుమెంట్లు, మ్యూజిక్, పిక్చర్స్, వీడియోస్, డెస్క్‌టాప్‌లను బ్యాకప్ చేస్తుంటుంది. మిగతా ఫోల్డర్లనూ బ్యాకప్ చేసుకోవాలంటే వాటినీ ఎంచు కోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ IPL Final: ఐపీఎల్ టాప్ 10 కథనాలు
-
Sports News
IPL 2023: ఐపీఎల్ విజేత ధోనీ సేన అయినా.. ఎక్కువ అవార్డులు ఆ జట్టుకే..
-
Movies News
Allu Arjun: నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు.. మా నాన్నే నాకు దేవుడు..: అల్లు అర్జున్
-
Sports News
Dhoni - Jaddu: మహీ భాయ్.. కేవలం నీ కోసమే: వైరల్‌గా మారిన జడ్డూ పోస్టు
-
India News
Manipur: మణిపుర్లో పరిస్థితులు సద్దుమణిగేందుకు కొంత సమయం పడుతుంది: సీడీఎస్
-
India News
ఫోన్ కోసం రిజర్వాయర్ తోడిన ఘటన.. ఆ నీళ్లకు డబ్బులు వసూలు చేయండి..!