ఐఫోన్ నీటిలో తడిస్తే?
ఐఫోన్ పొరపాటున నీళ్లలో పడిందా? అయితే వర్చువల్ అసిస్టెంట్ సిరిని ఆదేశించండి. ఇది ఫోన్‌లోంచి నీటిని బయటకు వెళ్లగొట్టటానికి సాయం చేస్తుంది. నిజానికి తాజా ఐఫోన్లు దుమ్ముధూళి, నీటిని తట్టుకుంటాయి.
ఐఫోన్ పొరపాటున నీళ్లలో పడిందా? అయితే వర్చువల్ అసిస్టెంట్ సిరిని ఆదేశించండి. ఇది ఫోన్‌లోంచి నీటిని బయటకు వెళ్లగొట్టటానికి సాయం చేస్తుంది. నిజానికి తాజా ఐఫోన్లు దుమ్ముధూళి, నీటిని తట్టుకుంటాయి. అంతమాత్రాన అసలే నీరు లోపలికి పోదని అనుకోవద్దు. కనెక్షన్ పోర్టులు, స్పీకర్ రంధ్రాల్లోంచి నీరు లోపలికి వెళ్లొచ్చు. ఇలాంటప్పుడు బియ్యంతో, సిలికా ప్యాకెట్లతో తేమను తొలగించటానికి ప్రయత్నిస్తుంటారు. యాపిల్ వర్చువల్ అసిస్టెంట్ సిరి ట్రిక్కు గురించే చాలామందికి తెలియదు. ఐఓఎస్ 12, ఆ తర్వాతి ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన ఐఫోన్లలో వాటర్ ఎజెక్షన్ సదుపాయముంది. స్పీకర్ నుంచి త్వరగా, తేలికగా నీటిని బయటకు వెళ్లగొట్టేందుకు దీన్ని రూపొందించారు. ఇది ప్రత్యేకమైన ధ్వనిని పుట్టిస్తుంది. దీని ద్వారా పుట్టుకొచ్చే శబ్ద తరంగాలు స్పీకర్‌లోంచి నీటిని బయటకు వెళ్లగొడతాయి. స్టీరియో స్పీకర్లు, వాటర్ రెసిస్టెంట్ డిజైన్ గల ఐఫోన్లలో వాటర్ ఎజెక్షన్ ఫీచర్ ఉంటుంది. ఐఫోన్ వెబ్ బ్రౌజర్ నుంచి ‘వాటర్ ఎజెక్ట్’ షార్ట్‌కట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని షార్ట్‌కట్స్ యాప్‌లో జత చేసుకోవాలి. ‘హే సిరి, రన్ వాటర్ ఎజెక్ట్’ అని ఆదేశిస్తే యాక్టివేట్ అవుతుంది. షార్ట్‌కట్స్ యాప్‌లో ‘బిగిన్ వాటర్ ఎజెక్షన్’ మీద తాకటంతోనూ యాక్టివేట్ చేసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ IPL Final: ఐపీఎల్ టాప్ 10 కథనాలు
-
Sports News
IPL 2023: ఐపీఎల్ విజేత ధోనీ సేన అయినా.. ఎక్కువ అవార్డులు ఆ జట్టుకే..
-
Movies News
Allu Arjun: నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు.. మా నాన్నే నాకు దేవుడు..: అల్లు అర్జున్
-
Sports News
Dhoni - Jaddu: మహీ భాయ్.. కేవలం నీ కోసమే: వైరల్‌గా మారిన జడ్డూ పోస్టు
-
India News
Manipur: మణిపుర్లో పరిస్థితులు సద్దుమణిగేందుకు కొంత సమయం పడుతుంది: సీడీఎస్
-
India News
ఫోన్ కోసం రిజర్వాయర్ తోడిన ఘటన.. ఆ నీళ్లకు డబ్బులు వసూలు చేయండి..!