యాపిల్ పండుగ!
యాపిల్ ఏటా నిర్వహించే వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ ఎప్పటి మాదిరిగానే కొత్త ఆవిష్కరణలకు వేదికైంది. కొత్త హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లతో టెక్ ప్రియుల అంచనాలు, ఊహలను నిజం చేసింది.
యాపిల్ ఏటా నిర్వహించే వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ ఎప్పటి మాదిరిగానే కొత్త ఆవిష్కరణలకు వేదికైంది. కొత్త హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లతో టెక్ ప్రియుల అంచనాలు, ఊహలను నిజం చేసింది. వినూత్న హెడ్‌సెట్, పలుచటి ల్యాప్‌టాప్ వంటి ఎన్నో పరికరాలను ముందుంచింది. వీటిల్లో కొన్ని ఇవీ..
వినూత్న హెడ్‌సెట్ విజన్ ప్రొ
ఊహించినట్టుగానే యాపిల్ మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ ఆవిష్కృతమైంది. దీని పేరు ‘విజన్ ప్రొ’. యాపిల్ ఎం2 చిప్‌తో కూడిన ఇది వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీల సమ్మేళనం. ప్రత్యక్ష సెన్సర్ ప్రాసెసింగ్ కోసం రూపొందించిన కొత్త ఆర్1 చిప్‌తో అనుసంధానమై పనిచేస్తుంది. ఇవి రెండూ దీనిలోని విజన్‌ఓఎస్ అనే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌కు దన్నుగా నిలుస్తాయి. చేతులతో పనిలేకుండా కళ్లు, తల, మాటతోనే యాప్స్ కంట్రోళ్లను, ఇతర టూల్స్‌ను వాడుకోవటానికిది వీలు కల్పిస్తుంది. కళ్లద్దాల మాదిరిగానే దీన్ని ధరించొచ్చు. కంటెంట్, యాప్స్ అన్నీ ఆగ్మెంటెడ్ రియాలిటీ మాదిరిగా కనిపిస్తాయి. 3డీ వాతావరణంలో కంటెంట్‌ను సృష్టించుకోవచ్చు, వాడుకోవచ్చు. ఈ హెడ్‌సెట్‌కు డిజిటల్ కిరీటంలా యాపిల్ వాచ్ ఉంటుంది. బ్యాటరీతో అనుసంధానమయ్యే ఇది 2 గంటల సేపు పనిచేస్తుంది. ఐసైట్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే ఎదుటివారికి మన కళ్లూ కనిపిస్తాయి. దీనికి 3డీ కెమెరా కూడా ఉంటుంది. కనిపించే దృశ్యాలను రికార్డు చేసుకోవచ్చు.
పలుచటి ల్యాప్‌టాప్ మ్యాక్‌బుక్ ఎయిర్
యాపిల్ కొత్త పరికరాల్లో చెప్పుకోవాల్సింది 15 అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్. దీని మందం కేవలం 11.5 మి.మీ., బరువేమో 1.3 కిలోలు. యాపిల్ ఎం1 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనికి 2 యూఎస్‌బీ పోర్టులు, మ్యాగ్‌సేఫ్ అనే ఛార్జింగ్ డాక్, ప్రామాణిక హెడ్‌ఫోన్ జాక్ ఉంటాయి. 8 కోర్ సీపీయూ, 10 కోర్ జీపీయూతో కూడిన దీని బ్యాటరీ 18 గంటల పాటు పనిచేస్తుంది. మిడ్‌నైట్, స్టార్‌నైట్‌తో పాటు మొత్తం నాలుగు రంగుల్లో మ్యాక్‌బుక్ ఎయిర్‌ను తీసుకొచ్చారు. దీని ప్రారంభ ధర రూ.1,34,900.
డెస్క్‌టాప్ కొత్త అవతారం మ్యాక్ ప్రొ
మ్యాక్ అప్‌గ్రేడ్ అవటం మరో విశేషం. దీన్ని మ్యాక్ ప్రొ రూపంలో ఆధునికీకరించారు. ఎం2 అల్ట్రా 24-కోర్ సీపీయూతో కూడిన ఇది 76-కోర్ జీపీయూ వరకూ సపోర్టు చేస్తుంది. థండర్‌బోల్ట్ 4 పోర్టులు ఎనిమిది, అధునాతన ప్రొ డిస్‌ప్లే ఎక్స్‌డీఆర్‌లు ఆరు వరకు ఉంటాయి. సృజనాత్మక నిపుణులు, డిజైనర్ల కోసం రూపొందించిన ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్‌తో వచ్చింది. కొత్త మ్యాక్ ప్రొ ధర రూ.7,29,900. యాపిల్ మ్యాక్ స్టుడియోనూ అప్‌డేట్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.2,09,900.
సరికొత్త ఫీచర్ల ఐఓఎస్ 17
ఐఫోన్ కొత్త సాఫ్ట్‌వేర్ ఐఓఎస్ 17 పలు కొత్త ఫీచర్లతో ముస్తాబయ్యింంది. వినూత్న నేమ్‌డ్రాప్ ఫీచర్‌తో రెండు ఐఫోన్లను గానీ రెండు యాపిల్ వాచ్‌లను గానీ అనుసంధానం చేసుకోవచ్చు. కాంటాక్ట్స్, మ్యూజిక్, ఇంటర్నెట్ వంటి వాటిని రెండింటిలోనూ వాడుకోవచ్చు. షేర్ చేసుకోవచ్చు. వీడియో, ఆడియో ఛాటింగ్ వేదికైన ఫేస్‌టైమ్‌కు వాయిస్ మెయిల్ సదుపాయాన్నీ జోడించారు. దీంతో స్నేహితులకు వీడియో మెసేజ్‌ను పంపించు కోవచ్చు. స్టాండ్‌బై మోడ్ మరో కొత్త ఆకర్షణ. స్టాండ్ మీద ఐఫోన్‌ను అడ్డంగా పెట్టినప్పడు ఇది పనిచేస్తుంది. నిలువుగా పెట్టినప్పుడు మొత్తం స్క్రీన్ మారిపోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TET Results: 27న టెట్ ఫలితాలు.. ఎన్నిగంటలకంటే?
-
PM Modi: అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో మోదీ పర్యటన
-
IND vs AUS: షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్‌తో మూడో వన్డేకు టీమ్ఇండియాలో 13 మందే
-
CM Kcr: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత
-
Social Look: శ్రీనిధి సెల్ఫీలు.. శ్రుతి హాసన్ హొయలు.. నుపుర్ ప్రమోషన్!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు