బ్రౌజింగ్ భద్రం!
ఇంటర్నెట్ బ్రౌజింగ్ రోజువారీ పనయ్యింది. ఈ నేపథ్యంలో సురక్షితకూ ప్రాధాన్యం పెరిగింది. బలమైన పాస్‌వర్డ్‌లను సృష్టించుకోవటం, వాటిని కనిపెట్టుకొని ఉండటం.. వెబ్ యాక్టివిటీని ట్రాకర్ల కంట పడకుండా చూసుకోవటం.. ఈమెయిల్ స్పామ్‌లను తప్పించుకోవటం.. ఫైళ్లు, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవటం నిత్యకృత్యంగా మారాయి.
ఇంటర్నెట్ బ్రౌజింగ్ రోజువారీ పనయ్యింది. ఈ నేపథ్యంలో సురక్షితకూ ప్రాధాన్యం పెరిగింది. బలమైన పాస్‌వర్డ్‌లను సృష్టించుకోవటం, వాటిని కనిపెట్టుకొని ఉండటం.. వెబ్ యాక్టివిటీని ట్రాకర్ల కంట పడకుండా చూసుకోవటం.. ఈమెయిల్ స్పామ్‌లను తప్పించుకోవటం.. ఫైళ్లు, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవటం నిత్యకృత్యంగా మారాయి. చూడటానికిది పెద్ద పనిగానే అనిపించొచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే తేలికగానే బ్రౌజింగ్‌ను భద్రం చేసుకోవచ్చు.
ఎప్పుడైనా HTTPS:// వాడాలి
చాలా వెబ్‌సైట్లు హైపర్‌టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రొటోకాల్ సెక్యూర్ (హెచ్‌టీటీపీఎస్) కనెక్షన్‌ను అందిస్తాయి. హెచ్‌టీటీపీ కనెక్షన్‌తో పోలిస్తే ఇది చాలా సురక్షితం. బ్రౌజర్‌తో మన కనెక్షన్‌ను ఎన్‌క్రిప్ట్ చేయటానికి హెచ్‌టీటీపీఎస్‌ను రూపొందించారు. వెబ్‌సైట్‌లో ఇది డిఫాల్ట్‌గా లేనట్టయితే ప్రమాదం పొంచి ఉన్నట్టే. కాబట్టి వెబ్ చిరునామా ముందు హెచ్‌టీటీపీఎస్ ఉందేమో నిర్ధరించుకోవాలి. దీనికి తేలికైన మార్గం వెబ్ చిరునామా పక్కన చిన్న గడియారం గుర్తుంటే సురక్షితమనే అనుకోవచ్చు.
పొట్టి యూఆర్‌ఎల్స్‌ను విస్తరించాలి
పొట్టి యూఆర్‌ఎల్స్ అన్నివేళలా విశ్వసనీయమైనవి కాకపోవచ్చు. కాబట్టి వీటిని క్లిక్ చేసే ముందు అప్రమత్తంగా ఉండాలి. కావాలంటే చెక్‌షార్ట్‌యూఆర్‌ఎల్ వంటి వెబ్ యాప్‌ల సాయం తీసుకోవచ్చు. పొట్టి యూఆర్‌ఎల్‌ను వీటిల్లో కాపీ చేస్తే పొడుగు యూఆర్‌ఎల్ కనిపిస్తుంది. అన్‌షార్టెన్ వంటి బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్ల సాయమూ తీసుకోవచ్చు. లింక్‌ను యాక్సెస్ చేయటానికి ముందు స్క్రీన్ షాట్ తీసుకోవటమూ మంచిదే.
క్లిక్ చేసే ముందు నిశితంగా..
ఇంటర్నెట్‌లో వెతుకుతున్నప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఏవో ఆసక్తికరమైన లింక్‌లు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. వాటి చూడగానే క్లిక్ చేస్తాం. ఇలాంటి ఉత్సుకతే చిక్కుల్లో పడేస్తుంది. ఎందుకంటే అది వైరస్‌తో కూడిన డౌన్‌లోడ్ అయ్యుండొచ్చు. నకిలీ వెబ్‌సైట్ కావొచ్చు. లేదూ ఫిషింగ్ కోసమే ప్రత్యేకంగా రూపొందించింది అయ్యుండొచ్చు. అందువల్ల క్లిక్ చేసే ముందు లింకులను నిశితంగా గమనించటం ఎంతైనా మంచిది. బ్రౌజర్ స్టేటస్ బార్‌ను చూస్తే లింకు వెనకాల దాగిన యూఆర్‌ఎల్ కనిపిస్తుంది. దేన్ని క్లిక్ చేస్తున్నామో తెలిసిపోతుంది. కావాలనుకుంటే వెబ్ ఆఫ్ ట్రస్ట్ వంటి ఎక్స్‌టెన్షన్ల సాయం తీసుకోవచ్చు. ఇలాంటి ఎక్స్‌టెన్షన్లు స్కోర్ల రూపంలో వెబ్‌సైట్ విశ్వసనీయతను తెలియజేస్తాయి. దీంతో అది సురక్షితమో, కాదో ఇట్టే తెలిసిపోతుంది. ‘మీ కంప్యూటర్ ప్రమాదంలో పడింది, వైరస్‌లతో నిండిపోయింది. ఫలానా క్లీనర్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి లేదా అన్నింటినీ పరిష్కరించుకోండి’ అంటూ కనిపించే ప్రకటనలను నమ్మొద్దు. సామాజిక వేదికల యాప్‌లు, వెబ్‌సైట్లలో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేటప్పుడూ జాగ్రత్త పాటించాలి. చిన్న పొరపాటైనా పెద్ద నష్టం కలిగించొచ్చు. ఇంటి లొకేషన్, ప్రయాణ గమ్యం, క్రెడిట్ కార్డు నంబరు వంటి వాటిని బహిరంగా ప్రకటించుకుంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే.
బ్రౌజర్ అప్‌టుడేట్
బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసినప్పుడు కొత్త ఫీచర్లు, బగ్ ఫిక్సెస్ అందటమే కాదు.. భద్రత లోపాలు, మాల్వేర్ల నుంచీ రక్షణ లభిస్తుంది. ప్రతి కొత్త అప్‌డేట్‌తో సెక్యూరిటీ ఫిక్సెస్ కూడా లభిస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు బ్రౌజర్‌ను తాజా వర్షన్‌కు అప్‌డేట్ చేస్తుండాలి.
వేరే కంప్యూటర్ల మీద ఇన్‌కాగ్నిటో పద్ధతి
ఎక్కువమంది వాడే కంప్యూటర్ మీద ఏదైనా సమాచారాన్ని వెతుకుతున్నప్పుడో, స్నేహితుడి పీసీలో ఈమెయిల్‌ను చెక్ చేస్తున్నప్పుడో బ్రౌజర్‌ను ప్రైవేట్ మోడ్ లేదా ఇన్‌కాగ్నిటో మోడ్‌ను ఎంచుకోవటం మంచిది. ప్రైవేట్ మోడ్‌లో బ్రౌజింగ్ చేసినప్పుడు దాని హిస్టరీ కంప్యూటర్‌లో సేవ్ కావు. కాపోతే డౌన్‌లోడ్ చేసినవి సేవ్ అవుతాయి. అయితే ప్రైవేట్ మోడ్‌లో బ్రౌజింగ్ చేసినప్పటికీ ట్రాక్ చేసే అవకాశముందని మరవరాదు. సొంత కంప్యూటర్‌లోనూ వస్తువుల ధరలు తెలుసుకునేటప్పుడు, వెబ్‌సైట్‌లో రెండో ఖాతాతో లాగిన్ అయ్యేటప్పుడు, సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లను కొనేటప్పుడు ఇన్‌కాగ్నిటో మోడ్‌ను ఉపయోగించటం మంచిది. మన కంప్యూటర్‌ను వేరేవారికి ఇస్తున్నప్పుడు గెస్ట్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవటమూ మేలే. దీంతో గెస్ట్ యూజర్‌కు కొన్ని పరిమితులే లభిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IND vs AUS: షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్‌తో మూడో వన్డేకు టీమ్ఇండియాలో 13 మందే
-
CM Kcr: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత
-
Social Look: శ్రీనిధి సెల్ఫీలు.. శ్రుతి హాసన్ హొయలు.. నుపుర్ ప్రమోషన్!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Jaishankar: ఐరాస వేదికగా.. కెనడా, పాకిస్థాన్‌లకు జైశంకర్ చురకలు!
-
Nara Lokesh: 29 నుంచి లోకేశ్ పాదయాత్ర తిరిగి ప్రారంభం