ఫొటోలకు రక్షణ కవచం
ప్రస్తుత కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ఏది అసలో, ఏది నకిలీనో తెలియని స్థితి నెలకొంది. ఫొటో, వీడియోలను సృష్టించే టూల్స్ విస్మయం కలిగిస్తున్నాయి.
ప్రస్తుత కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ఏది అసలో, ఏది నకిలీనో తెలియని స్థితి నెలకొంది. ఫొటో, వీడియోలను సృష్టించే టూల్స్ విస్మయం కలిగిస్తున్నాయి. పదాల రూపంలో ఇచ్చే ప్రాంప్ట్‌లతోనే ఇమేజ్‌లను సృష్టిస్తున్నాయి. డీప్ ఫేక్ టెక్నాలజీ తిమ్మిని బమ్మి చేస్తోంది. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఫొటోలను వీటి సాయంతో ఎవరైనా ఎలాగైనా మార్చే అవకాశముంది. ఇవి సృష్టించిన ఫొటోలు నకిలీవని నిరూపించుకోవటమూ కష్టమే. అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థలు అవి సహజమే అన్నంతగా మార్చేస్తున్నాయి మరి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు భద్రమేనా? అన్న సందేహం, భయం కలగటంలో ఆశ్చర్యం లేదు. మార్చిన ఫొటోలతో మోసగాళ్లు బెదిరించటానికి వాడుకోవచ్చు. మహిళల ఫొటోలను ఆశ్లీల చిత్రాలుగా మలచొచ్చు. ఇలాంటి ప్రమాదంలో పడకుండా చూడటానికి మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు వినూత్న టూల్‌ను రూపొందించారు. దీని పేరు ఫొటో గార్డ్. పేరుకు తగ్గట్టుగానే ఇది ఫొటోలకు రక్షణ కవచంగా నిలుస్తుంది. అతి సూక్ష్మ పద్ధతుల్లో, మన కంటికి కనిపించని విధంగా ఫొటోల్లో మార్పులు చేస్తుంది. దీంతో ఎవరైనా స్టేబుల్ డిఫ్యూజన్ వంటి టూల్స్‌తో మార్చటానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటుంది. ఫొటో గార్డ్‌లోని ఎన్‌కోడర్ అటాక్ పరిజ్ఞానం ఇమేజ్‌కు అదృశ్య సంకేతాలను జోడిస్తుంది. ఇలా ఏఐ టూల్స్ దీన్ని మరో దానిలా భావించేలా చేస్తుంది. ఇక డిఫ్యూజన్ అటాక్ పరిజ్ఞానమేమో రహస్య సంకేతాలతో ఏఐ టూల్స్ పనిచేసే విధానాన్నే తప్పుదారి పట్టిస్తుంది. ప్రాంప్ట్ సూచనలను పట్టించుకోని విధంగా ఏమారుస్తుంది. అందువల్ల ఏఐ టూల్స్ ఫొటోలను మార్చినప్పటికీ అసహజంగా, మెలి తిరిగినట్టుగా, వంకర టింకరగా కనిపించేలా చేస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ షికాగోకు చెందిన కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ బెన్ జావో సైతం ఇలాంటి రక్షణ పద్ధతిని సృష్టించారు. గ్లేజ్ అనే ఇది కళాకారులు తాము గీసిన చిత్రాలను ఏఐ టూల్స్ వాడుకోకుండా కాపాడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World Cup 2023: వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. సీనియర్ ఆటగాడికి దక్కని చోటు
-
TET Results: 27న టెట్ ఫలితాలు.. ఎన్నిగంటలకంటే?
-
PM Modi: అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో మోదీ పర్యటన
-
IND vs AUS: షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్‌తో మూడో వన్డేకు టీమ్ఇండియాలో 13 మందే
-
CM Kcr: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత
-
Social Look: శ్రీనిధి సెల్ఫీలు.. శ్రుతి హాసన్ హొయలు.. నుపుర్ ప్రమోషన్!