పవర్ అప్ టూల్స్
కంప్యూటర్ పరిజ్ఞానం బాగా గలవారికి మైక్రోసాఫ్ట్ పవర్‌టాయ్స్ పరిచితమే. పీసీకి అద్భుతమైన ఫీచర్లు జోడించుకోవటానికిదో మంచి సదుపాయం. దీనికి ఎప్పటికప్పుడు కొత్త టూల్స్ తోడవుతూనే ఉంటాయి.
కంప్యూటర్ పరిజ్ఞానం బాగా గలవారికి మైక్రోసాఫ్ట్ పవర్‌టాయ్స్ పరిచితమే. పీసీకి అద్భుతమైన ఫీచర్లు జోడించుకోవటానికిదో మంచి సదుపాయం. దీనికి ఎప్పటికప్పుడు కొత్త టూల్స్ తోడవుతూనే ఉంటాయి. అందువల్ల దీన్ని డబ్బులతో కొనుక్కోవాల్సి ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. కానీ నిజానికిది పూర్తిగా ఉచితం. ఇందులో తాజాగా చేరిన టూల్స్‌లో కొన్ని ఆసక్తికరమైనవి ఇవిగో..
ఒకే మౌజ్ పలు పీసీల్లో
ఒకే కీబోర్డు, మౌజ్‌ను పలు కంప్యూటర్లకు వాడుకుంటే? ‘మౌజ్ వితౌట్ బార్డర్’ టూల్ అలాంటి సదుపాయాన్నే కల్పిస్తుంది. దీంతో ఒకే మౌజ్‌ను నాలుగు కంప్యూటర్లకు వాడుకోవచ్చు. క్లిప్‌బోర్డు డేటాను, ఫైళ్లను అన్ని పరికరాల్లో షేర్ చేసుకోవచ్చు.
ఫైల్ ప్రివ్యూ తేలికగా
మ్యాక్‌ఓఎస్ నుంచి విండోస్‌కు మారుతున్నారా? అయితే ఫైల్ ప్రివ్యూ ఆప్షన్‌ను కోల్పోతున్నట్టే. మ్యాక్‌లో ఏ ఫైలునైనా ఎంచుకొని, స్పేస్‌బార్‌ను నొక్కితే క్విక్ ప్రివ్యూ కనిపిస్తుంది. పవర్‌టాయ్స్ ‘పీక్’ టూల్ ఇలాంటి పనే చేస్తుంది. దీంతో పీసీ మీద ఫైలును ఎంచుకొని.. కంట్రోల్, స్పేస్ మీటలను కలిపి నొక్కితే సరి. ఫోల్డర్‌లో చాలా ఫైళ్లు ఉన్నట్టయితే ఎడమ లేదా కుడి బాణం గుర్తులను నొక్కటం ద్వారా ఒక్కో ఫైలు వివరాలను చూసుకోవచ్చు.
ఒక్క టెక్స్ట్ మాత్రమే
వెబ్ పేజీలో టెక్స్ట్‌ను సెలెక్ట్ చేసుకుంటాం. టెక్స్ట్‌తో పాటు దాని ఫార్మాట్లూ సెలెక్ట్ అవుతాయి. కానీ మామూలు టెక్స్ట్ మాత్రమే పేస్ట్ కావాలంటే? ‘పేస్ట్ యాజ్ ప్లెయిన్ టెక్స్ట్’ టూల్ వాడుకుంటే సరి. పేరుకు తగ్గట్టుగానే ఇది క్లిప్‌బోర్డులో కాపీ అయిన టెక్స్ట్‌ను ఫార్మాట్ లేకుండా పేస్ట్ చేస్తుంది. ఏ యాప్‌లోనైనా ఫార్మాట్ లేకుండా టెక్స్ట్‌ను పేస్ట్ చేసుకోవటానికిది ఎంతో ఉపయుక్తం. దీన్ని షార్ట్‌కట్‌గా వాడుకోవాలనుకుంటే విండోస్, కంట్రోల్, వీ బటన్లను కలిపి నొక్కాలి.
ఫైల్ లాక్‌స్మిత్
ఫైలును డిలీట్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఎర్రర్ ఎదురవ్వచ్చు. ఏదో తెలియని ప్రోగ్రామ్ రన్ అవుతుండటం వల్ల డిలీట్ కాకపోవచ్చు. ఇలాంటి సమయంలో ఫైల్ లాక్‌స్మిత్ టూల్ సాయం చేస్తుంది. ఆ ఫైలును ఏ ప్రాసెస్‌లు వాడుకుంటున్నాయో తెలియజేస్తుంది. డిలీట్ చేయాలనుకునే ఫైలు మీద రైట్ క్లిక్ చేసి, వాట్స్ యూజింగ్ దిస్ ఫైల్‌ను ఎంచుకుంటే వివరాలు తెలుస్తాయి.
మౌజ్ జంప్
మరీ పెద్ద మానిటర్, ఒకే సమయంలో ఎక్కువ మానిటర్లను వాడుతున్నప్పుడు వెంటనే ఎక్కువ దూరానికి కర్సర్‌ను కదల్చటానికి తోడ్పడే సాధనం ‘మౌజ్ జంప్. ఇది మొత్తం తెర మీద చిన్న ప్రివ్యూను సృష్టిస్తుంది. దీంతో తెర మీద ఎక్కడికైనా పాయింటర్‌ను తీసుకెళ్లొచ్చు.
రిజిస్ట్రీ ప్రివ్యూ
ఇది పవర్ యూజర్లకు మాత్రమే. విండోస్ రిజిస్ట్రీ ఫైళ్లను ఎడిట్ చేస్తున్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు. ఇది .౯’్ణ ఫైళ్లు అన్నింటినీ ఓపెన్ చేస్తుంది. ఏ ఫైళ్లు ఎడిట్ అవుతున్నాయో ప్రివ్యూ కనిపిస్తుంది. ఆయా రిజిస్ట్రీ ఫైళ్ల విలువలూ ప్రత్యక్షమవుతాయి.
హోస్ట్స్ ఫైల్ ఎడిటర్
ఇంటర్నెట్‌లో ఏ వెబ్‌సైట్‌నైనా చూస్తున్నప్పుడు పీసీ దాని హోస్ట్ ఫైళ్లను చెక్ చేస్తుంది. అది ఏ ఐపీ అడ్రస్‌కు కనెక్ట్ అయ్యిందో చూస్తుంది. ఒకవేళ ఏదైనా వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయాల నుకుంటే ఈ ఫైలును ఎడిట్ చేసుకోవచ్చు. ఇందుకు హోస్ట్స్ ఫైల్ ఎడిటర్ టూల్ బాగా పనికొస్తుంది. ఇది టెక్స్ట్ ఓన్లీ ఫైలుకు బదులు మంచి ఇంటర్ఫేస్ సదుపాయాన్ని కల్పిస్తుంది. దీంతో తేలికగా ఫైలును ఎడిట్ చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nitish Kumar: సచివాలయానికి వెళ్లిన సీఎం నీతీశ్‌కు షాక్!
-
World Cup: వన్డే ప్రపంచకప్ జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం
-
Viral video : సింగపూర్‌లో 100 కేజీల బాంబు పేల్చివేత!
-
PM Modi: గత 30 రోజుల్లో.. 85 మంది ప్రపంచ నేతలను కలిశా: మోదీ
-
Chandrababu Arrest: ఏం నేరం చేశారని చంద్రబాబును జైల్లో పెట్టారు: మురళీ మోహన్
-
భారత్ రాకెట్లలో 95 శాతం విడిభాగాలు స్వదేశీవే: ఇస్రో ఛైర్మన్