క్రోమ్‌ బ్రౌజర్‌ ఐఫోన్‌ తెర అడుగున

సాంకేతిక రంగంలో యాపిల్‌ చూసే ప్రభావం అంతా ఇంతా కాదు. కంపెనీలు తమ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోనూ మార్పులు చేసేలా పురికొల్పుతుంది.

Published : 30 Aug 2023 00:08 IST

సాంకేతిక రంగంలో యాపిల్‌ చూసే ప్రభావం అంతా ఇంతా కాదు. కంపెనీలు తమ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోనూ మార్పులు చేసేలా పురికొల్పుతుంది. వినూత్న ఫీచర్లతో ఆకట్టుకోవటమే కాకుండా వాటిని ఇతర కంపెనీలూ అనుకరించేలా చేస్తుంది. ఐఫోన్ల కోసం గూగుల్‌ తీసుకొస్తున్న తాజా ఫీచరే దీనికి ఉదాహరణ. ఇది క్రోమ్‌ బ్రౌజర్‌లో యూఆర్‌ఎల్‌ బార్‌ను తెర కింది భాగానికి మార్చుకునేలా చేస్తుంది. ఈ ఫీచర్‌ను యాపిల్‌ రెండేళ్ల క్రితమే సఫారీ బ్రౌజర్‌లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు గూగుల్‌ దాన్ని అనుసరిస్తోంది.

యాప్స్‌ను పరీక్షించటానికి తోడ్పడే యాపిల్‌ వేదిక టెస్ట్‌ఫ్లైట్‌ ద్వారా ఈ కొత్త క్రోమ్‌ వర్షన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందులో అడ్రస్‌ బార్‌ను రెండు విధాలుగా తెర అడుగు భాగానికి చేర్చుకోవచ్చు. బార్‌ మీద నొక్కి పట్టి, స్థానాన్ని మార్చుకోవచ్చు. లేదూ క్రోమ్‌ సెటింగ్స్‌ ద్వారానైనా బార్‌ స్థానాన్ని కిందికి తెచ్చుకోవచ్చు. ప్రస్తుతం చాలా ప్రాంతాలకు కొత్త క్రోమ్‌ వర్షన్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు తెలుస్తోంది. మీరూ టెస్ట్‌ఫ్లైట్‌ను వాడుతున్నారా? అయితే ఓసారి దీన్ని పరీక్షించొచ్చు. ఇది అందరికీ అందుబాటులోకి వస్తే చాలా వెసులుబాటుగా ఉంటుంది. ఒకప్పటి కన్నా ఇప్పుడు ఫోన్ల తెరలు చాలా పెద్దగా అయ్యాయి. బొటనవేలు దగ్గరే అడ్రస్‌ బార్‌ ఉంటే వెబ్‌సైట్‌ పేరును టైప్‌ చేయటం, సెర్చ్‌ చేయటం తేలికవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని