లొకేషన్లకు నచ్చిన ఎమోజీ
గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ సేవ్ చేసుకున్నారా? వాటిని చూడటం ఇకపై తేలిక కానుంది. సేవ్ చేసిన లొకేషన్లకు లవ్, ఆహారం, ఆటలు, పార్క్‌లు, గుడులు.. ఇలా రకరకాల ఎమోజీలను జోడించుకోవచ్చు మరి. ఇటీవలే గూగుల్ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది.
గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ సేవ్ చేసుకున్నారా? వాటిని చూడటం ఇకపై తేలిక కానుంది. సేవ్ చేసిన లొకేషన్లకు లవ్, ఆహారం, ఆటలు, పార్క్‌లు, గుడులు.. ఇలా రకరకాల ఎమోజీలను జోడించుకోవచ్చు మరి. ఇటీవలే గూగుల్ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ను వాడుకోవాలంటే.. ముందు గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేయాలి. తెర దిగువన సేవ్డ్ ట్యాబ్ మీద నొక్కాలి. ఇది గూగుల్ మ్యాప్స్‌తో డిఫాల్ట్‌గా వచ్చే వాంట్ టు గో, ట్రావెల్ ప్లాన్స్, లేబుల్డ్, స్టార్డ్ ప్లేసెస్ వంటి వాటికి వర్తించదు. అందువల్ల కొత్త జాబితాను సృష్టించుకోవటమో, మనం సృష్టించుకున్న జాబితాను సవరించుకోవటమో చేయాల్సి ఉంటుంది. సేవ్ మీద తాకి, కొత్త జాబితాను సృష్టించుకొని, ఇష్టమైన పేరు పెట్టుకోవాలి. జాబితా పైన మధ్యలో కొత్త ఐకన్ గుర్తు ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఎమోజీల క్రమం కనిపిస్తుంది. ఇష్టమైన దాన్ని ఎంచుకొని, వివరణ రాసుకోవాలి. తర్వాత జాబితాలో ఉన్న లొకేషన్లను సెలెక్ట్ చేసుకుంటే సరి. అన్నింటికీ అదే ఎమోజీ స్థిరపడుతుంది. ఇలా ఆయా చోట్లకు వేర్వేరు ఎమోజీలు జతచేసుకోవచ్చు. దీంతో ఇష్టమైన ప్రాంతాలను, తరచూ వెళ్లే చోట్లను తేలికగా గుర్తించొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: 72అడుగుల ఎత్తైన దీన్‌దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
-
Delimitation: దక్షిణాది వాణిని అణచివేయాలని చూస్తే మౌనం వహించేది లేదు: కేటీఆర్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Vasu Varma: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది నేను కాదు: ‘జోష్’ దర్శకుడు
-
RBI: ఆర్బీఐ కొరడా.. ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు పెనాల్టీ
-
నెట్టింట్లో బాలికల నకిలీ నగ్న చిత్రాలు.. AI చిత్రాలపై స్పెయిన్ దిగ్భ్రాంతి