కారెక్కడ పెట్టానబ్బా?

మాల్‌లోనో మరెక్కడో పార్కింగ్‌ స్థలంలో కారు, బైకు నిలిపారు. కానీ ఎక్కడ నిలిపారో గుర్తు లేదు. చాలాసేపు వెతికితే గానీ తెలియలేదు.

Published : 25 Oct 2023 00:36 IST

మాల్‌లోనో మరెక్కడో పార్కింగ్‌ స్థలంలో కారు, బైకు నిలిపారు. కానీ ఎక్కడ నిలిపారో గుర్తు లేదు. చాలాసేపు వెతికితే గానీ తెలియలేదు. తరచూ ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నట్టయితే ఫోన్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ సాయం తీసుకోవచ్చు. వాహనాన్ని పార్క్‌ చేసినప్పుడు గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌లో బ్లూ డాట్‌ మీద తాకాలి. అప్పుడు లొకేషన్‌ కనిపిస్తుంది. తర్వాత సేవ్‌ లొకేషన్‌ ఎంచుకోవాలి. మనం తొలగించేంతవరకు సేవ్‌ చేసిన లొకేషన్‌ అలాగే ఉంటుంది. దీంతో వెంటనే ఆ ప్రాంతాన్ని గుర్తించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని