ఫొటో కటౌట్‌ చిటికెలో

ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్‌ చేయటం పెద్ద పని. అడోబ్‌ ఫొటోషాప్‌, ఏఐ టూల్స్‌ వంటి అధునాతన సాధనాలు అవసరం.

Published : 28 Feb 2024 00:06 IST

ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్‌ చేయటం పెద్ద పని. అడోబ్‌ ఫొటోషాప్‌, ఏఐ టూల్స్‌ వంటి అధునాతన సాధనాలు అవసరం. ఐఓఎస్‌ 16, ఆ తర్వాత ఓఎస్‌తో పనిచేసే ఐఫోన్‌ చేతిలో ఉంటే ఇది చిటికెలో పనే. ఫొటోస్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, ఇమేజ్‌ను ఎంచుకోవాలి. కటౌట్‌ చేయాలనుకునే ఆకారం మీద తాకి, దాని చుట్టూ కాంతి కనిపించే వరకూ అదమాలి. వేలిని తీయగానే కాపీ, షేర్‌, యాడ్‌ స్టికర్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో షేర్‌ను ఎంచుకొని సేవ్‌ ఇమేజ్‌ మీద తాకాలి. అప్పుడది వేరే ఫైలుగా సేవ్‌ అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని