రియల్‌మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు

రియల్‌మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్‌ జెశ్చర్స్‌ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది.

Published : 20 Mar 2024 00:20 IST

 

రియల్‌మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్‌ జెశ్చర్స్‌ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. అంటే తెరను తాకకుండానే మెనూలో అవసరమైన పనులు చేసుకోవచ్చన్నమాట. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 చిప్‌తో కూడిన ఇందులో 128 జీబీ లేదా 256 జీబీ స్టోరేజీ ఉంటుంది. స్టోరేజీని పెంచుకోవటానికి ఎస్‌డీ స్లాట్‌ లేదు గానీ డైమెన్సెటీ చిప్‌ 5జీ కనెక్టివిటీని కల్పిస్తుంది. 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ గల ఇది వైర్‌తో త్వరగా ఛార్జ్‌ అవుతుంది. ఏఎంఓఎల్‌ఈడీ తెరతో కూడిన ఇందులో రెయిన్‌వాటర్‌ స్మార్ట్‌ టచ్‌ ఫీచర్‌ కూడా ఉంది. ఇది వేలిముద్రలను, నీటి బిందువులను వేర్వేరుగా పసిగడుతుంది. కాబట్టి తడి చేతులతోనూ ఫోన్‌ను వాడుకోవచ్చు. 128 జీబీ ఫోన్‌ ప్రారంభ ధర రూ.18,999. అదే 256 జీబీ ఫోన్‌ ప్రారంభ ధర రూ.19,999. వీటిని అమెజాన్‌లో, రియల్‌మీ వెబ్‌సైట్‌లో మార్చి 22 నుంచి కొనుక్కోవచ్చు. ఫోన్లతో పాటు రియల్‌మీ టీ300 టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌ఫోన్స్‌ ఉచితంగా పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని