ఉంగరమే న్యూట్రిషనిస్ట్‌

సామ్‌సంగ్‌ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది.

Published : 27 Mar 2024 00:03 IST

సామ్‌సంగ్‌ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. సామ్‌సంగ్‌ ఫుడ్‌, సామ్‌సంగ్‌ ఇ-ఫుడ్‌ వేదికలతో అనుసంధానమయ్యే ఇది ప్రపంచవ్యాప్తంగా వంటకాల సమాచారాన్ని విశ్లేషించగలదు. గెలాక్సీ రింగ్‌ ముందుగా యూజర్ల డేటాను సేకరిస్తుంది. దానికి అనుగుణంగా సరిపోయేలా.. ఎంత, ఎలాంటి ఆహారం తినాలో సూచిస్తుంది. అంటే ఇదొక వర్చువల్‌, డిజిటల్‌ న్యూట్రిషనిస్టుగా వెంట ఉంటుందన్నమాట.

 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని