కొత్త సర్ఫేస్‌ ల్యాప్‌టాప్‌లు

వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్‌ ప్రొ 10, సర్ఫేస్‌ ల్యాప్‌టాప్‌ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్‌ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది.

Published : 27 Mar 2024 00:10 IST

వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్‌ ప్రొ 10, సర్ఫేస్‌ ల్యాప్‌టాప్‌ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్‌ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. మైక్రోసాఫ్ట్‌ కోపైలట్‌ సాయంతో ఉత్పాదకతను పెంచుకోవటానికి తోడ్పడతాయని కంపెనీ చెబుతోంది. సర్ఫేస్‌ కీబోర్డుల మీద ప్రత్యేకించి కోపైలట్‌ మీట కూడా ఉండటం విశేషం. టచ్‌, వాయిస్‌ కమాండ్లతో సర్ఫేస్‌ ప్రొ 10తో పనిచేసుకోవచ్చు. సర్ఫేస్‌ స్లిమ్‌ పెన్‌ అయినా ఉపయోగించుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌ 365 యాప్స్‌లో ఉత్పాదకతను పెంచుకోవటానికి కోపైలట్‌ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు- చేత్తో రాసిన విషయాలను వన్‌నోట్‌ విశ్లేషించగలదు. లక్ష్యాలను క్రమబద్ధీకరిస్తుంది. పనులు వేగంగా చేసుకోవటానికి తోడ్పడుతుంది. ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా హెచ్‌ శ్రేణి ప్రాసెసర్‌తో కూడిన సర్ఫేస్‌ ల్యాప్‌టాప్‌ 6 ఎక్కువ గంటలు పనులు చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇందులో పరికరం త్వరగా వేడెక్కకుండా చేసే సదుపాయం ఉంటుంది మరి. కోపైలట్‌ కీ సాయంతో ఏఐని వాడుకోవచ్చు. ప్లానింగ్‌, డాక్యుమెంట్‌ రివైవల్‌, వెబ్‌సైట్‌ ఎనాలిసిస్‌ వంటి పనులెన్నో చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని