మిమిక్రీ ఇంజిన్‌!

ప్రముఖ కృత్రిమ మేధ కంపెనీ ఓపెన్‌ఏఐ తాజాగా వాయిస్‌ అసిస్టెంట్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా వాయిస్‌ ఇంజిన్‌ అనే వినూత్న టూల్‌ను పరిచయం చేసింది.

Published : 03 Apr 2024 00:25 IST

ప్రముఖ కృత్రిమ మేధ కంపెనీ ఓపెన్‌ఏఐ తాజాగా వాయిస్‌ అసిస్టెంట్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా వాయిస్‌ ఇంజిన్‌ అనే వినూత్న టూల్‌ను పరిచయం చేసింది. వ్యక్తుల గొంతులను అచ్చం అలాగే పునః సృష్టించటం దీని ప్రత్యేకత. కేవలం 15 సెకండ్ల నిడివి రికార్డు స్పీచ్‌ సాయంతోనే గొంతులను అనుకరించటం విశేషం. అంటే ఒకరకంగా దీన్ని మిమిక్రీ ఇంజిన్‌ అనుకోవచ్చు. ఇది గొప్ప టూలే అయినప్పటికీ దుర్వినియోగం చేసే అవకాశం ఉండటం వల్ల ప్రస్తుతానికి ఎంపికచేసిన కొందరు టెస్టర్లకే అందుబాటులోకి తెచ్చారు. మనదేశంలో ఎన్నికలు జరుగుతుండటం.. ఇటీవల ఏఐ సృష్టించిన రాజకీయ నాయకుల గొంతులతో రోబో కాల్స్‌ పుట్టుకొస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటం అత్యావశ్యకంగా మారింది. నిజానికి ఇప్పటికే చాలా అంకుర సంస్థలు వాయిస్‌ క్లోనింగ్‌ సొల్యూషన్లను అందిస్తున్నాయి. వీటి విషయంలో ఓపెన్‌ఏఐ నైతికతకు ప్రాధాన్యం ఇవ్వటం విశేషం. వాయిస్‌ ఇంజిన్‌ను పరీక్షించటానికి అనుమతి పొందినవారూ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. ఆయా వ్యక్తుల అనుమతి తీసుకున్న తర్వాతే వారి గొంతులను సృష్టించటానికి వీలుంటుంది. అలాగే అవి ఏఐ ద్వారా సృష్టించినవని ప్రకటించాల్సి ఉంటుంది కూడా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని