మొబైల్‌ రోబో

వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్‌తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్‌ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్‌ఓఓఐ. ఇదో చిన్న డెస్క్‌టాప్‌ రోబో.

Published : 03 Apr 2024 00:26 IST

వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్‌తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్‌ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్‌ఓఓఐ. ఇదో చిన్న డెస్క్‌టాప్‌ రోబో. ఇది స్మార్ట్‌ఫోన్‌కు జీవం తెచ్చిపెడుతుంది! అయస్కాంతం సాయంతో ఫోన్‌ను జతచేసుకొని రోబో మాదిరిగా టేబుల్‌ మీద కదలాడుతుంది. మొబైల్‌ తెర మీద కళ్ల బొమ్మలతో సంతోషం, ఆశ్చర్యం వంటి హావభావాలను కనబరుస్తుంది. ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాయంతో మనుషుల ముఖాలను, వస్తువులను గుర్తిస్తుంది. పక్కకు వచ్చినవారిని పోల్చుకుంటుంది. అవసరమైతే ఫొటో కూడా తీసి పెడుతుంది. ఛాట్‌జీపీటీతో అనుసంధానమై అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానాలు అందిస్తుంది కూడా. కాల్‌ నోటిఫికేషన్లు ప్రదర్శిస్తుంది. గడియారంలా ఉపయోగపడుతుంది. వీడియో గేమ్స్‌ ఆడుకోవటానికీ తోడ్పడుతుంది. అదీ కీబోర్డుతో పనిలేకుండా. శరీర కదలికలతోనే గేమ్స్‌లో కార్ల వంటి వాటిని పరుగెత్తించొచ్చు. మనదేశంలో ఈ రోబో టూల్‌ ధర సుమారు రూ.10,755.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని