పిక్సెల్‌ ఫోన్లలో లుకప్‌ ఫీచర్‌

గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్‌ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్‌ చేసే వారిని గుర్తించే లుకప్‌ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్‌లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు.

Published : 10 Apr 2024 00:11 IST

గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్‌ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్‌ చేసే వారిని గుర్తించే లుకప్‌ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్‌లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పిక్సెల్‌ ఫోన్లకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. గూగుల్‌ ఫోన్‌ బీటా వర్షన్‌ 127.0.620688474 గలవారి పరికరంలో లుకప్‌ ఫీచర్‌ ఉన్నట్టు బయటపడింది. కాంటాక్ట్స్‌లో సేవ్‌ చేయని నంబర్ల నుంచి కాల్‌ వచ్చినప్పుడు ఆ నంబరు మీద తాకితే యాడ్‌ కాంటాక్ట్‌, మెసేజ్‌, హిస్టరీ ఆప్షన్ల పక్కన లుకప్‌ ఫీచర్‌ కనిపిస్తుంది. దీని మీద తాకితే ఆ నంబరు ఎవరిదో తెలుసుకోవచ్చు. ఇది ఆయా యాప్‌ల సాయంతో వెబ్‌లో శోధించి ఎవరి నంబరో గుర్తిస్తుంది. ఉదాహరణకు- గూగుల్‌ సెర్చ్‌ను ఎంచుకుంటే నేరుగా వెబ్‌లోనే వెదికి సమాచారాన్ని అందిస్తుంది. బ్యాంకుల వంటి వాణిజ్య సంస్థలకు చెందిన ఫోన్‌ నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను గుర్తించటానికిది తోడ్పడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని