మెటా టూల్‌తో యానిమేషన్‌

మీ పిల్లలు బొమ్మలు గీస్తుంటారా? పోనీ అల్లిబిల్లిగానైనా బొమ్మలేస్తుంటారా? వీటిని యానిమేషన్‌ రూపంలోకి మార్చుకోవాలనీ అనుకుంటున్నారా? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి.

Published : 19 Apr 2023 00:21 IST

మీ పిల్లలు బొమ్మలు గీస్తుంటారా? పోనీ అల్లిబిల్లిగానైనా బొమ్మలేస్తుంటారా? వీటిని యానిమేషన్‌ రూపంలోకి మార్చుకోవాలనీ అనుకుంటున్నారా? అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. మెటా సంస్థ ఇందుకోసం వెబ్‌ వర్షన్‌ యానిమేటెడ్‌ డ్రాయింగ్‌ టూల్‌ను విడుదల చేసింది. దీనిలోకి ఇమేజెస్‌ను అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. బొమ్మలను స్వల్ప వ్యవధి యానిమేషన్‌ చిత్రాలుగానూ మలచుకోవచ్చు. కృత్రిమ మేధతో పనిచేసే దీన్ని ఓపెన్‌ సోర్సుగానే అందుబాటులో ఉంచింది. అంటే ఎవరైనా దీన్ని వాడుకోవచ్చన్నమాట. డెమో దశలోనే దీనిలోకి 67 లక్షల ఇమెజేస్‌ అప్‌లోడ్‌ అయ్యాయని మెటా పేర్కొంటోంది.

దీన్నెలా వాడుకోవాలో తెలుసా?

* ముందుగా https://sketch.metademolab.com/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.  

* ‘అప్‌లోడ్‌ ఫొటో’ బటన్‌ మీద నొక్కి యానిమేషన్‌గా మలచుకోవాలనుకునే బొమ్మను అప్‌లోడ్‌ చేయాలి.  

* ఆ బొమ్మను వాడుకోవటానికి మెటా ట్రెయిన్‌కు అనుమతి ఇవ్వాలి. క్యాప్చర్‌ బాక్సు ద్వారా బొమ్మను రీసైజ్‌ చేసుకోవచ్చు. నెక్స్ట్‌ బటన్‌ నొక్కుతూ ఆప్షన్లు ఎంచుకోవాలి.

* బొమ్మకు తగినట్టుగా వాకింగ్‌, డ్యాన్స్‌, జంపింగ్‌, ఫన్నీ వంటి ప్రిసెట్‌ ఆప్షన్లు ఎంచుకోవాలి. ఫినిష్‌ బటన్‌ నొక్కగానే యానిమేషన్‌ ప్రత్యక్షమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని