ఫోన్ పోతే?
మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలించినా వాటిని గుర్తించటానికి ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా ‘సంచార్ సాథీ’ అనే వెబ్‌సైట్‌ను ఆరంభించింది.
మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలించినా వాటిని గుర్తించటానికి ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా ‘సంచార్ సాథీ’ అనే వెబ్‌సైట్‌ను ఆరంభించింది. దీని ద్వారా ఐఎంఈఐ నంబరు సాయంతో పోయిన ఫోన్లు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. తాత్కాలికంగా బ్లాక్ చేయొచ్చు. అప్పుడవి పని చేయటం మానేస్తాయి. ప్రయోగాత్మక ప్రాజెక్టుగా దీన్ని కొన్ని టెలికం సర్కిళ్లలో అందుబాటులో ఉంచారు. మరి దీన్నెలా వాడుకోవాలి?
* ముందుగాhttps://sarcharsaathi.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.* ‘బ్లాక్ యువర్ లాస్ట్/స్టోలెన్ మొబైల్’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.* మొబైల్ నంబరు, ఐఎంఈఐ నంబరు, మొబైల్ కంపెనీ పేరు, మోడల్‌ను నమోదు చేయాలి. ఫోన్ బిల్లునూ అప్‌లోడ్ చేయాలి.* ఫోన్ ఎక్కడ, ఎప్పుడు పోయిందో నమోదు చేయాలి.* ఫోన్ కొన్నవారి గుర్తింపు పత్రంతో పాటు పేరు, చిరునామా, ఈమెయిల్ ఐడీ వివరాలు అందజేయాలి.
* ఓటీపీ నంబరు కోసం అందుబాటులో ఉన్న ఫోన్ నంబరు ఇవ్వాలి.
* ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబరును ఎంటర్ చేసి, ధ్రువీకరించుకోవాలి.
* డిక్లరేషన్‌ను అంగీకరించి, సబ్‌మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి.
* అప్పుడు పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. తర్వాత ఖాతాలోకి లాగిన్ అవ్వాలి.
* పోయిన ఫోన్‌ను గుర్తించటానికి ‘ఐఎంఈఐ సెర్చ్’ బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడది కొన్ని వివరాలను అడుగుతుంది. వాటిని సరిగ్గా టైప్ చేయాలి. దీంతో ఫోన్ ఎక్కడుందో తెలిసిపోతుంది.* ఫోన్‌ను బ్లాక్ చేయాలనుకుంటే ‘బ్లాక్/లాస్ట్ ఫోన్’ మీద క్లిక్ చేసి.. ఫోన్ నంబరును ఎంటర్ చేయాలి. అనంతరం ‘బ్లాక్’ బటన్ మీద క్లిక్ చేయాలి.* దీంతో ఆ ఫోన్ బ్లాక్ అవుతుంది. వేరే సిమ్ కార్డు వేసినా అది పని చేయదు. వ్యక్తిగత వివరాలు భద్రంగా ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IND vs AUS: షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్‌తో మూడో వన్డేకు టీమ్ఇండియాలో 13 మందే
-
CM Kcr: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత
-
Social Look: శ్రీనిధి సెల్ఫీలు.. శ్రుతి హాసన్ హొయలు.. నుపుర్ ప్రమోషన్!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Jaishankar: ఐరాస వేదికగా.. కెనడా, పాకిస్థాన్‌లకు జైశంకర్ చురకలు!
-
Nara Lokesh: 29 నుంచి లోకేశ్ పాదయాత్ర తిరిగి ప్రారంభం