గూగుల్‌ కొత్త ఏఐ టూల్స్‌

కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ ప్రాచుర్యం పొందుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏఐ వేదికలు టెక్నాలజీ రంగాన్ని విస్తృతం చేస్తున్నాయి. గూగుల్‌ తమ ఏఐ వేదిక బార్డ్‌ పేరును ‘జెమినీ’గా మార్చింది. అంతేకాదు.. ఇటీవల ఇమేజ్‌ఎఫ్‌ఎక్స్‌, మ్యూజిక్‌ఎఫ్‌ఎక్స్‌, టెక్స్ట్‌ఎఫ్‌ఎక్స్‌ అనే కొత్త ఫీచర్లనూ జోడించింది.

Published : 14 Feb 2024 00:13 IST

ఇవన్నీ https://labs.google/ లో అందుబాటులో ఉంటాయి

కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ ప్రాచుర్యం పొందుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏఐ వేదికలు టెక్నాలజీ రంగాన్ని విస్తృతం చేస్తున్నాయి. గూగుల్‌ తమ ఏఐ వేదిక బార్డ్‌ పేరును ‘జెమినీ’గా మార్చింది. అంతేకాదు.. ఇటీవల ఇమేజ్‌ఎఫ్‌ఎక్స్‌, మ్యూజిక్‌ఎఫ్‌ఎక్స్‌, టెక్స్ట్‌ఎఫ్‌ఎక్స్‌ అనే కొత్త ఫీచర్లనూ జోడించింది.

ఇమేజ్‌ఎఫ్‌ఎక్స్‌: టెక్స్ట్‌ ప్రాంప్ట్‌లను అందిస్తే ఇమేజ్‌లను సృష్టించటం దీని ప్రత్యేకత. ఇది గూగుల్‌కు చెందిన ఇమేజన్‌2టెక్స్ట్‌-టు-ఇమేజ్‌ మోడల్‌ మాదిరిగానే పనిచేస్తుంది. దీంతో ఫొటోల మీద ప్రయోగాలూ చేయొచ్చు. ఇందుకోసం ఎక్స్‌ప్రెసివ్‌ చిప్స్‌ను ఇమేజ్‌ఎఫ్‌ఎక్స్‌లో జోడించింది. ఫొటోలో వేర్వేరు సృజనాత్మక ప్రయోగాలు చేయటానికివి వీలు కల్పిస్తాయి. ఉదాహరణకు- రియలిస్టిక్‌ ఫొటోను చేత్తో గీసిన చిత్రంగా మలుస్తుంది. నైరూప్య (అబ్‌స్ట్రాక్ట్‌) చిత్రాలుగానూ రూపొందిస్తుంది. మిడ్‌జర్నీ, డాల్‌-3 వంటి ఆన్‌లైన్‌ ఇమేజ్‌ జనరేషన్‌ టూల్స్‌కిది గట్టి పోటీని ఇవ్వగలదని భావిస్తున్నారు. ఇది సృష్టించిన చిత్రాలు ఏఐ జనరేటెడ్‌ అని తెలుసుకునేలా ఐపీటీసీ మెటాడేటా కలిగుంటాయి.

మ్యూజిక్‌ఎఫ్‌ఎక్స్‌: మనం సూచించే పదాల ఆధారంగా సంగీతాన్ని సృష్టించే ఇది 70 సెకండ్ల నిడివిగల ట్యూన్లను అందిస్తుంది. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు, షేర్‌ చేసుకోవచ్చు. మరింత వేగంగా, నాణ్యంగా సంగీతాన్ని సృష్టించే విధంగానూ దీన్ని తీర్చిదిద్దుతున్నారు.

టెక్స్ట్‌ఎల్‌ఎం: ఇది గూగుల్‌కు చెందిన పామ్‌ 2 లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ను ఉపయోగించుకొని పనిచేస్తుంది. టెక్స్ట్‌, లాంగ్వేజ్‌తో సృజనాత్మక మాటలు, పదాలను సృష్టిస్తుంది. ఇందులో రకరకాల టూల్స్‌ ఉంటాయి. ఉదాహరణకు- సిమిలీ టూల్‌లో ఏదైనా పదాన్ని, అంశాన్ని టైప్‌ చేస్తే అలాంటి వాటిని పోలిన బోలెడన్ని అంశాలను మన ముందుంచుతుంది. పాటల రచయితలు, కవులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కడైనా ఏదైనా సరైన పదం తోచటం లేనప్పుడు దీని సాయం తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని