యాప్‌ మాటలు వింటోందా?

ఫోన్‌లో ఏదో మాట్లాడతాం. అనంతరం ఏదో వెబ్‌సైట్‌ చూస్తుంటే వాటికి సంబంధించిన ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఇది యాదృచ్ఛికమే కావొచ్చు గానీ ఫోన్‌లో మాట్లాడే మాటలు యాప్‌లు వింటున్నాయనే అనుమానం వస్తుంటుంది.

Published : 21 Feb 2024 00:22 IST

ఫోన్‌లో ఏదో మాట్లాడతాం. అనంతరం ఏదో వెబ్‌సైట్‌ చూస్తుంటే వాటికి సంబంధించిన ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఇది యాదృచ్ఛికమే కావొచ్చు గానీ ఫోన్‌లో మాట్లాడే మాటలు యాప్‌లు వింటున్నాయనే అనుమానం వస్తుంటుంది. ఇలాంటి సందేహమే వస్తుంటే ఓసారి ఫోన్‌ సెటింగ్స్‌ను పరిశీలించొచ్చు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోనైతే- యాప్స్‌ ద్వారా పర్మిషన్‌లోకి వెళ్లి, మైక్రోఫోన్‌ మీద క్లిక్‌ చేయాలి. ఇందులో ఏయే యాప్‌లకు మైక్రోఫోన్‌ వాడకానికి అనుతిచ్చారో తెలుస్తుంది. అనవసరమైనవి కనిపిస్తే బటన్‌ను ఆఫ్‌ చేయొచ్చు. ఐఫోన్‌లోనైతే- సెటింగ్స్‌ ద్వారా ప్రైవసీ అండ్‌ సెటింగ్స్‌లోకి వెళ్లి మైక్రోఫోన్‌ మీద తాకాలి. మైకును టర్న్‌ ఆఫ్‌ చేసుకోవాలనుకునే యాప్‌ను గుర్తించి స్విఛాఫ్‌ చేసుకుంటే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని