టాయ్‌లెట్‌ ఎక్కడ?

బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్‌ టాయ్‌లెట్ల విషయంలో మహిళలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. పట్ణణాల్లోనైతే ఈ సమస్య మరీ ఎక్కువ.

Published : 06 Mar 2024 01:21 IST

బయటకు వెళ్లినప్పుడు పబ్లిక్‌ టాయ్‌లెట్ల విషయంలో మహిళలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటుంటారు. పట్ణణాల్లోనైతే ఈ సమస్య మరీ ఎక్కువ. పబ్లిక్‌ టాయ్‌లెట్లు అందుబాటులో ఉండకపోవటం.. ఒకటీ అరా ఉన్నా పరిశుభ్రంగా లేకపోవటం గమనిస్తూనే ఉంటాం. అందుకేనేమో ఎక్కడ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి ఉంటుందోనని బయటకు వెళ్లినప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు మహిళలు తక్కువగా నీరు తాగుతుంటారు. దీంతో ఒంట్లో నీటిశాతం తగ్గటం, మూత్ర ఇన్‌ఫెక్షన్ల వంటి సమస్యలూ తలెత్తుతాయి. ఇటీవల హార్పిక్‌ ఇండియా దిల్లీలో నిర్వహించిన సర్వేలో తేలిన విషయం ఏంటంటే- అవసరమైన సమయాల్లో 70% మహిళలకు వాడుకోవటానికి వీలైన పబ్లిక్‌ టాయ్‌లెట్‌ ఎక్కడుందో తెలియకపోవటం. కేవలం ఈ కారణంతోనే 78% మంది క్షేత్రస్థాయి పనులకు నిరాకరించటమో, సుదీర్ఘ ప్రయాణాలు మానెయ్యటమో చేస్తున్నారు కూడా. ఇలాంటి ఇబ్బందులు తొలగించటానికి హార్పిక్‌ సంస్థ పబ్లిక్‌ టాయ్‌లెట్లను గుర్తించే యాప్‌ను రూపొందించింది. దీని పేరు హార్పిక్‌ లొకేటర్‌. ఇది సమీపంలోని పబ్లిక్‌ టాయ్‌లెట్లను తేలికగా గుర్తించటానికి తోడ్పడుతుంది. టాయ్‌లెట్లలోని సదుపాయాలను బట్టి రేటింగ్‌ ఇచ్చే ఫీచరూ ఉంటుంది. ఈ రేటింగ్‌ ఆధారంగా ఏది మంచిదో తెలుసుకోవటానికీ వీలుంటుంది. ఈ యాప్‌ అందరికీ ఉపయోగ పడేదే అయినా మహిళలకు మరింత ఎక్కువ ఉపయుక్తమని భావి స్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని