ఫైల్స్‌లో స్కాన్‌!

డాక్యుమెంట్లు, ఫైళ్లను ఒకదగ్గర నిల్వ చేసుకోవటానికి, తేలికగా షేర్‌ చేయటానికి గూగుల్‌ ఫైల్స్‌ యాప్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికి కొత్తగా స్కాన్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది.

Updated : 13 Mar 2024 04:18 IST

డాక్యుమెంట్లు, ఫైళ్లను ఒకదగ్గర నిల్వ చేసుకోవటానికి, తేలికగా షేర్‌ చేయటానికి గూగుల్‌ ఫైల్స్‌ యాప్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికి కొత్తగా స్కాన్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. క్లౌడ్‌ ఆధారిత స్టోరేజీ స్పేస్‌తో పనిచేసే దీంతో డాక్యుమెంట్లను డిజిటల్‌ రూపంలోకి మార్చుకొని, స్టోర్‌ చేసుకోవచ్చు. స్కాన్‌ బటన్‌ మీద ట్యాప్‌ చేయగానే ఫైల్స్‌ యాప్‌ దానంతటదే పరికరంలోని కెమెరా యాప్‌ను ఓపెన్‌ చేస్తుంది. అప్పుడు తేలికగా స్కాన్‌ చేసుకోవచ్చు. అనంతరం ఎడిటింగ్‌ టూల్స్‌ సాయంతో క్రాప్‌, రొటేట్‌, క్లీన్‌ వంటి అప్లికేషన్లతో అవసరమైనట్టుగా మార్చుకోవచ్చు. తర్వాత స్కాన్‌ చేసుకున్న ఫైళ్లు పీడీఎఫ్‌ రూపంలోకి మారతాయి. వీటిని డాక్యుమెంట్స్‌ విభాగంలో స్కాన్డ్‌ జాబితాలో చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి పిక్సెల్‌ పరికరాల్లోనే స్కాన్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తోంది. మున్ముందు అన్ని పరికరాలకు విస్తరించొచ్చు. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే..?

  •  స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ యాప్‌ ద్వారా ఫైల్స్‌ను ఓపెన్‌ చేయాలి.
  • స్కాన్‌ బటన్‌ మీద తాకి స్కాన్‌ చేయాలనుకునే డాక్యుమెంట్‌ను ఫ్రేమ్‌లో ఒదిగిపోయేలా చూసుకోవాలి.
  • ఇమేజ్‌ను తీసుకున్నాక, డాక్యుమెంట్‌ను ఎడిట్‌ చేసుకోవాలి. స్కాన్‌ అయిన డాక్యుమెంట్లు పీడీఎఫ్‌ రూపంలో వేరే ఫోల్డర్‌లో సేవ్‌ అవుతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని