మీ అభ్యర్థి చరిత్రేంటి?

మీ నియోజకవర్గం అభ్యర్థి ఎలాంటివారు? నేర చరిత్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే ‘నో యువర్‌ క్యాండిడేేట్‌’ (కేవైసీ) యాప్‌లో చూసుకోండి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఇటీవల ఎన్నికల క్రమాన్ని ప్రకటించటంతో పాటు ఈ యాప్‌నూ పరిచయం చేశారు

Updated : 20 Mar 2024 04:00 IST

మీ నియోజకవర్గం అభ్యర్థి ఎలాంటివారు? నేర చరిత్ర ఏమైనా ఉందా? తెలుసుకోవాలంటే ‘నో యువర్‌ క్యాండిడేేట్‌’ (కేవైసీ) యాప్‌లో చూసుకోండి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఇటీవల ఎన్నికల క్రమాన్ని ప్రకటించటంతో పాటు ఈ యాప్‌నూ పరిచయం చేశారు. ఇది ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వేదికలు రెండింటి మీదా అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా అభ్యర్థుల నేర చరిత్రతో పాటు ఆర్థిక స్థితిగతులనూ తెలుసుకోవచ్చు. ఇలా ఓటర్లు సరైన నిర్ణయం తీసుకోవటానికి తోడ్పడుతుంది. అభ్యర్థుల పేరుతో సెర్చ్‌ చేసి, సమాచారాన్ని పొందొచ్చు. నేరాలకు పాల్పడి ఉన్నట్టయితే అవి ఎలాంటివో కూడా ఇందులో కనిపిస్తాయి.

సి-విజిల్‌ యాప్‌: ఓటర్లను ప్రలోభ పెట్టటానికి డబ్బులు పంచటం వంటి వాటికి పాల్పడుతుంటే దీని సాయం తీసుకోవచ్చు. దీని ద్వారా ఫొటో తీసి లేదా వీడియోను రికార్డు చేసి అప్‌లోడ్‌ చేస్తే చాలు. యాప్‌లోని జీఐఎస్‌ మ్యాప్స్‌ ఫీచర్‌ దానంతటదే లొకేషన్‌ను గుర్తిస్తుంది. ఫిర్యాదు జిల్లా కంట్రోల్‌ రూమ్‌కు, అక్కడి నుంచి ఫీల్డ్‌ యూనిట్‌ అధికారులకు చేరుతుంది. లొకేషన్‌ ఆధారంగా సంఘటన జరిగిన చోటును గుర్తిస్తారు. ఫిర్యాదును ధ్రువీకరించి ఎన్నికల సంఘానికి చెందిన నేషనల్‌ గ్రీవన్స్‌ పోర్టల్‌కు పంపిస్తారు. ఫిర్యాదు చేసినవారికి దాని స్థితిగతులను 100 నిమిషాల్లో తెలియజేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని