హాయ్‌ ఐయామ్‌ నమో ఏఐ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్‌ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్‌ కూడా జతచేరింది.

Updated : 17 Apr 2024 09:47 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్‌ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్‌ కూడా జతచేరింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, వీటితో క్షేత్రస్థాయిలో ఒనగూరిన ప్రయోజనాలకు సంబంధించిన సమాచారాన్ని అందించటం దీని ప్రత్యేకత. ఇది ఛాట్‌బాట్‌ టూల్స్‌ ద్వారా ప్రధానమంత్రి, ప్రభుత్వ విజయాల గురించీ వివరిస్తుంది. ఇలా ప్రశ్నలు అడగ్గానే అలా సంక్షిప్త జవాబులిస్తుంది. ఉదాహరణకు- హర్‌ ఘర్‌ జల్‌ పథకం కోసం ప్రధానమంత్రి ఏం చేశారు? అని అడిగారనుకోండి. ఆ పథకం, సాధించిన పురోగతి వివరాలను అందిస్తుంది. ప్రధానమంత్రి మోదీ ప్రజాదరణ మీద ప్రశ్నించారనుకోండి. ఆసక్తికరమైన జవాబు పొందొచ్చు. ఆయన ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతని.. ప్రజాదరణలో అమెరికా అధ్యక్షుడు జోయ్‌ బైడన్‌, బ్రిటన్‌ ప్రధానమంత్రి రుషి సునాక్‌, కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడోలను అధిగమించారని చెబుతుంది. అడగాలే గానీ ప్రధానమంత్రి ఎన్ని అవార్డులు అందుకున్నారో కూడా వివరిస్తుంది. ప్రజలతో విస్తృతంగా అనుసంధానం కావటానికి ఒక ప్రధానమంత్రి ఇలాంటి ఏఐ టూల్‌ను వాడటం ప్రపంచంలో ఇదే మొదటిసారి. అయితే నమో ఏఐ ఛాట్‌బాట్‌ అందించిన సమాచారం కచ్చితత్వాన్ని అధికారిక వెబ్‌సైట్లతో ధ్రువీకరించుకోవటం మంచిది. ఇతరత్రా ఛాట్‌బాట్‌ పరిజ్ఞానాల మాదిరిగానే ఇందులోనూ కొన్ని లోపాలు తలెత్తొచ్చు. నరేంద్ర మోదీ వెబ్‌సైట్‌ లేదా నరేంద్ర మోదీ మొబైల్‌ వర్షన్‌ ద్వారా డెస్క్‌టాప్‌, మొబైల్‌ పరికరాలు రెండింటిలోనూ నమో ఏఐని చేరుకోవచ్చు. ప్రశ్నలకు జవాబులను పీడీఎఫ్‌ రూపంలోనూ పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని