అమెజాన్‌ మ్యూజిక్‌లో ఏఐ ప్లేలిస్టు ఫీచర్‌

సంగీత ప్రియులను ఆకట్టుకోవటానికి మ్యూజిక్‌ యాప్‌లు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్పోటిఫై ఇటీవల ప్రీమియం యూజర్ల కోసం ఏఐ ఆధారిత ప్లేలిస్ట్‌ జనరేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Published : 24 Apr 2024 00:14 IST

సంగీత ప్రియులను ఆకట్టుకోవటానికి మ్యూజిక్‌ యాప్‌లు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్పోటిఫై ఇటీవల ప్రీమియం యూజర్ల కోసం ఏఐ ఆధారిత ప్లేలిస్ట్‌ జనరేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా అమెజాన్‌ సైతం అలాంటి ఫీచర్‌నే పరిచయం చేసింది. దీని పేరు మ్యాస్ట్రో. ఇది ప్రాంప్ట్స్‌ ఆధారంగా ప్లేలిస్టును క్రియేట్‌ చేయటమే కాకుండా ఎమోజీలతోనూ పనిచేస్తుంది. మ్యాస్ట్రో సృష్టించిన ప్లేలిస్టును తర్వాత ఎప్పుడైనా వినాలనుకుంటే సేవ్‌ చేసుకోవచ్చు. ఇతరులతోనూ షేర్‌ చేసుకోవచ్చు. అనుచిత ప్రాంప్ట్స్‌, దుర్భాషల వంటివి అడ్డుకోవటానికి ఇందులో జాగ్రత్తలూ తీసుకున్నారు. ప్రస్తుతానికిది బీటా వర్షన్‌లోనే ఉంది. అదీ అమెరికాలో కొందరికే అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ విస్తరించే అవకాశముంది. అమెజాన్‌ ప్రైమ్‌, అన్‌లిమిటెడ్‌ అమెజాన్‌ మ్యూజిక్‌ సబ్‌స్క్రయిబర్లు ఉచితంగా దీన్ని వాడుకోవచ్చు. అమెజాన్‌ అన్‌లిమిటెడ్‌ మ్యూజిక్‌ సభ్యులైతే ప్లేలిస్టులను వెంటనే వినొచ్చు, సేవ్‌ చేసుకోవచ్చు. అదే ప్రైమ్‌ సభ్యులైతే సేవ్‌ చేసుకోవటానికి ముందు 30 సెకండ్ల ప్రివ్యూలను వినొచ్చు. ఇది కొత్త పరిజ్ఞానం కావటం వల్ల తొలిసారి అంత సవ్యంగా ప్లేలిస్టును కూర్చకపోవచ్చని గుర్తించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని