‘కీప్‌’ గోయింగ్‌!

రోజురోజుకీ నోట్‌-టేకింగ్‌ యాప్స్‌కు ఆదరణ పెరుగుతోంది. వివిధ ప్రయోజనాలు ఉండటంతో యువత వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు బోలెడన్ని ఉచిత నోట్‌ టేకింగ్‌ యాప్‌లూ అందుబాటులో ఉన్నాయి.

Published : 24 Apr 2024 00:14 IST

రోజురోజుకీ నోట్‌-టేకింగ్‌ యాప్స్‌కు ఆదరణ పెరుగుతోంది. వివిధ ప్రయోజనాలు ఉండటంతో యువత వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు బోలెడన్ని ఉచిత నోట్‌ టేకింగ్‌ యాప్‌లూ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఒకటి గూగుల్‌ కీప్‌. ఇది అదే ఖాతాతో ఇతర గూగుల్‌ యాప్స్‌తో అనుసంధానం కావటం వల్ల ఏ పరికరం మీదైనా తేలికగా వాడుకోవచ్చు. అయితే దీని ప్రత్యేక ఫీచర్లు తెలిసుంటే మరిన్ని పనులు చేసుకోవచ్చు.

గూగుల్‌ కీప్‌లో ముఖ్యమైన ఫీచర్‌ లేబుల్స్‌. నోట్స్‌ను అంశాల వారీగా ఒకదగ్గర పెట్టుకోవటానికిది తోడ్పడుతుంది. దీన్ని ఒకసారి క్రియేట్‌ చేసుకుంటే చాలు. అర్జంట్‌, వర్క్‌, రిమైండర్స్‌, ఫ్యామిలీ.. ఇలా రకరకాలుగా నోట్స్‌ను తేలికగా మార్క్‌ చేసుకోవచ్చు. సెర్చ్‌ ప్రాంప్ట్‌ ద్వారానూ వీటిని వెతుక్కునే వీలుండటం మరో ప్రత్యేకత.

  • చేయాల్సిన పనుల జాబితా (టు-డు లిస్ట్‌) సృష్టించుకోవటానికి గూగుల్‌ కీప్‌ యాప్‌ మంచి సాధనం. చెక్‌ బాక్స్‌ ఫార్మాట్‌లో తేలికగా జాబితాను సృష్టించుకోవచ్చు. పని పూర్తికాగానే బాక్స్‌ మీద ట్యాప్‌ చేస్తే సరి.
  • ఆకర్షణీయంగా కనిపించేలా గూగుల్‌ కీప్‌ను అలంకరించుకోవచ్చు కూడా. క్రియేట్‌ చేసుకున్న నోట్‌కు బ్యాక్‌గ్రౌండ్‌ రంగు, ఇమేజ్‌ను జోడించుకోవచ్చు. ఇలా యాప్‌ను అందంగా కనిపించేలా చూసుకోవచ్చు.
  • ఇది గూగుల్‌కు చెందింది కావటం వల్ల బోలెడన్ని కొలాబరేషన్‌ టూల్స్‌ సైతం అందుబాటులో ఉంటాయి. అందువల్ల స్నేహితులు, కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులను కొలాబరేటర్‌గా జోడించుకొని తేలికగా నోట్స్‌ను షేర్‌ చేసుకోవచ్చు. అవతలివారికి నోట్స్‌ను ఎడిట్‌ చేసే అవకాశాన్నీ కల్పించొచ్చు.
  • రిమైండర్స్‌ను సెట్‌ చేసుకునే వీలుండటం వల్ల ఆయా తేదీ, సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. ఆ సమయానికి యాప్‌ దానంతటదే ఆయా విషయాలను గుర్తుచేస్తుంది. రిమైండర్స్‌ను చాలాసార్లు రిపీట్‌ చేసుకోవచ్చు కూడా.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని