గూగుల్‌ ఖాతా భద్రం

‘ఫేస్‌బుక్‌లో అలాంటి పోస్ట్‌ పెట్టావేంటి?’ అని మిత్రులెవరైనా అడిగారా? మీరు పంపించని మెయిళ్లు అవుట్‌బాక్సులో కనిపిస్తున్నాయా? మీ పేరు మీద ఎవరో రుణాలు తీసుకున్నట్టు గుర్తించారా? ఇవీ ఒకరకం మోసాలే.

Published : 01 May 2024 00:02 IST

‘ఫేస్‌బుక్‌లో అలాంటి పోస్ట్‌ పెట్టావేంటి?’ అని మిత్రులెవరైనా అడిగారా? మీరు పంపించని మెయిళ్లు అవుట్‌బాక్సులో కనిపిస్తున్నాయా? మీ పేరు మీద ఎవరో రుణాలు తీసుకున్నట్టు గుర్తించారా? ఇవీ ఒకరకం మోసాలే. ఇలాంటి వాటి బారినపడకుండా అప్పుడప్పుడూ గూగుల్‌ ఖాతాను చెక్‌ చేసుకోవటం మంచిది. మనకు తెలిసినవారూ ఖాతాల్లో చొరపడుతున్నారేమో తెలుసుకోవటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనికి పెద్దగా సమయమేమీ పట్టదు. నిమిషంలోనే పూర్తవుతుంది.

  • ముందుగాhttps://myaccount.google.com/intro/device-activity లోకి వెళ్లాలి. ఖాతాలోకి సైన్‌ఇన్‌ కావాలి. ఇందులో ఇటీవల లేదా గత 28 రోజుల్లో సైన్‌ ఇన్‌ అయిన కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల వంటివన్నీ కనిపిస్తాయి. ప్రతి సెషన్‌ లేదా లాగిన్‌ రికార్డు అవుతుంది కాబట్టి ఒకే పరికరం చాలాసార్లు కనిపించొచ్చు. దీనికి బాధపడాల్సిన పనిలేదు. చాలాకాలంగా వాడకుండా మూలకు పడేసిన పాత ఫోన్‌ లేదా కంప్యూటర్‌ వంటి పరికరాలూ కనిపించొచ్చు. ఇలాంటి వాటి నుంచి సైన్‌ అవుట్‌ కావటం ఉత్తమం. ఆయా పరికరాల మీద క్లిక్‌ చేసి సైన్‌ అవుట్‌ మీద క్లిక్‌ చేస్తే చాలు. ఆ పరికరం నుంచి గూగుల్‌ ఖాతాను యాక్సెస్‌ చేయటం పూర్తిగా ఆగుతుంది.
  • మీకు తెలియని కంప్యూటర్‌, ఫోన్ల వంటివి కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. వాటి మీద క్లిక్‌ చేసి ‘డోంట్‌ రికగ్నయిజ్‌ సమ్‌థింగ్‌’ను ఎంచుకోవాలి. లేదా సైన్‌ అవుట్‌ కావాలి.
  • అలాగే పాస్‌వర్డ్‌ను మార్చుకోవటం మరవొద్దు. దీంతో అప్పటికే లాగిన్‌ అయినవారిని ఖాతాలోకి వెళ్లకుండా నివారించుకోవచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు