Artificial intelligence: సూపర్ ఐరావత్‌

మనదేశ కృత్రిమ మేధ (ఏఐ) సూపర్‌ కంప్యూటర్‌ ‘ఐరావత్‌’ గొప్ప శిఖరాన్ని అధిరోహించింది. అంతర్జాతీయ సూపర్‌కంప్యూటింగ్‌ కాన్ఫరెన్స్‌(ఐఎస్‌సీ 2023)లో 75వ ర్యాంకు సాధించి సంచలనం సృష్టించింది.

Published : 31 May 2023 00:35 IST

నదేశ కృత్రిమ మేధ (ఏఐ) సూపర్‌ కంప్యూటర్‌ ‘ఐరావత్‌’ గొప్ప శిఖరాన్ని అధిరోహించింది. అంతర్జాతీయ సూపర్‌కంప్యూటింగ్‌ కాన్ఫరెన్స్‌(ఐఎస్‌సీ 2023)లో 75వ ర్యాంకు సాధించి సంచలనం సృష్టించింది. మనదేశంలోని ఏఐ కంప్యూటింగ్‌ వ్యవస్థల్లో ఇదే అతి పెద్దది, అత్యంత వేగవంతమైంది. ఇది 13,170 టెరాఫ్లాప్స్‌ వేగంతో పనిచేస్తుంది మరి. కాబట్టే కృత్రిమ మేధ కంప్యూటర్‌ రంగంలో గొప్ప శక్తిగా భావిస్తున్నారు. దీన్ని నెట్‌వెబ్‌ టెక్నాలజీస్‌ తయారుచేసింది. ఉబుంటు 20.04.2 ఎల్‌టీఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో నడుస్తుంది. అతి నాణ్యమైన ఏఎండీ ఈపీవైసీ 7742 64సి 2.25జీహెచ్‌జెడ్‌ ప్రాసెసర్‌ గల దీన్ని ఇటీవలే పుణేలోని సీడాక్‌లో నెలకొల్పారు. మనదేశం నాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, పాటర్న్‌ రికగ్నిషన్‌, వ్యవసాయం, విద్య, వైద్యం, ఆడియో అసిస్టెన్స్‌, రోబోటిక్స్‌ వంటి పలు రంగాల్లో కృత్రిమ మేధను వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగానే ఏఐ సూపర్‌ కంప్యూటర్ల మీద ప్రత్యేక దృష్టి సారించింది. రెండేళ్లకోసారి నిర్వహించే ఐఎన్‌సీ సదస్సులో ప్రపంచంలోనే 500 మేటి సూపర్‌ కంప్యూటర్ల జాబితాను వెలువరిస్తారు. ఫ్లోటింగ్‌ పాయింట్‌ లెక్కల వేగాన్ని విశదీకరించే లిన్‌ప్యాక్‌ బెంచ్‌మార్క్‌ ఆధారంగా వీటికి ర్యాంకులను కేటాయిస్తారు. ఇందులో ఐరావత్‌ మాత్రమే కాదు.. పరమ్‌ సిద్ధి-ఏఐ (131 ర్యాంకు), ప్రత్యూష్‌ (169 ర్యాంకు), మిహిర్‌ (316 ర్యాంకు) కూడా చోటు దక్కించుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని