Lenovo - Infinix: లెనోవా ఆండ్రాయిడ్ ట్యాబ్.. ఇన్ఫీనిక్స్ బడ్జెట్‌ ల్యాప్‌టాప్‌!

లెనోవా పీ11 సిరీస్‌లో రెండో జనరేషన్‌ ట్యాబ్‌ను.. ఇన్ఫీనిక్స్‌ బడ్జెట్‌ ధరలో ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేశాయి. ఇన్ఫీనిక్స్ ల్యాప్‌టాప్‌ మూడు వేరియంట్లలో, లెనోవా ట్యాబ్‌ సింగిల్ వేరియంట్‌లో అందుబాటులో ఉన్నాయి. 

Published : 14 Oct 2022 00:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లెనోవా, ఇన్ఫీనిక్స్ సంస్థలు రెండు కొత్త ఉత్పత్తులను భారత్‌ మార్కెట్లోకి విడుదల చేశాయి. లెనోవా కంపెనీ ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను పరిచయం చేయగా, ఇన్ఫీనిక్స్‌ బడ్జెట్‌ ధరలో ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. మరి, వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.


లెనోవా ట్యాబ్‌ పీ11 ప్రో (Lenovo Tab P11 Pro 2 Gen)

ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో ఈ ట్యాబ్ పనిచేస్తుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 11.2 అంగుళాల సినిమాటిక్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఈ ట్యాబ్‌ డాల్బీ విజన్‌ హెచ్‌డీఆర్‌, హెచ్‌డీఆర్‌10+ను సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ కొంపానియో 1300టీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుకవైపు, 13 ఎంపీ, ముందుభాగంలో 8 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. బిల్ట్‌-ఇన్‌ ట్రాక్‌పాడ్‌తో డిటాచబుల్ కీబోర్డ్‌, లెనోవా ప్రెసిసన్ పెన్‌3 డివైజ్‌లు ట్యాబ్‌తోపాటు ఇస్తున్నారు. డాల్బీ అట్‌మోస్‌ సపోర్ట్‌తో నాలుగు జేబీఎల్‌ స్పీకర్లు ఉన్నాయి. 8,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 14 గంటలు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. 8 జీబీ ర్యామ్‌/256 జీబీ స్టోరేజ్ ధర ₹ 39,999. అక్టోబరు 17 నుంచి లెనోవా, అమెజాన్‌ వెబ్‌సైట్‌లతోపాటు, లెనోవా అధీకృత స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయొచ్చు. 


ఇన్ఫీనిక్స్‌ ఇన్‌బుక్‌ ఎక్స్‌2 ప్లస్‌ (Infinix Inbook X2 Plus)

15.6 అంగుళాల ఐపీఎస్‌ ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే ఇస్తున్నారు. విండోస్‌ 11 ఓఎస్‌తో పనిచేస్తుంది. 11వ జనరేషన్‌ ఐ3(8జీబీ ర్యామ్‌/ 256జీబీ స్టోరేజ్‌, 512 జీబీ), ఐ5 (8 జీబీ/512 జీబీ), ఐ7 (16 జీబీ/512 జీబీ) ప్రాసెసర్‌లతో ల్యాప్‌టాప్‌ అందుబాటులో ఉంది. 1080పిక్సెల్‌ ఫుల్‌హెచ్‌డీ వెబ్‌క్యామ్‌ ఇస్తున్నారు. 65 వాట్‌ టైప్‌-సీ ఛార్జర్‌తో 50డబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్‌చేస్తే 10 గంటల మూవీ ప్లేబ్యాక్‌ టైమ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర ₹ 32,990 కాగా, గరిష్ఠ ధర ₹ 79,990. అక్టోబరు 18 నుంచి ఇన్ఫీనిక్స్‌, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని