Nothing Phone 1: సగం ధరకే నథింగ్‌ ఫోన్‌.. షరతులు వర్తిస్తాయి!

ట్రాన్సపరెంట్ డిజైన్‌, ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో నథింగ్ కంపెనీ ఫోన్‌ 1ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ను సగం ధరకే సొంతం చేసుకునే ఆఫర్‌ను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్‌. దాంతో మరికొన్ని అదనపు ఫీచర్లు కూడా ఇస్తోంది. అవేంటో చూద్దాం. 

Published : 06 Nov 2022 20:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆకర్షణీయమైన డిజైన్‌తో నథింగ్ కంపెనీ తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది జులై నెలలో మార్కెట్లోకి విడుదల చేసింది. ఐఫోన్‌కు పోటీగా నథింగ్‌ ఫోన్‌ 1ను తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈవో కార్ల్‌ పై తెలిపారు.  ఫ్లాగ్‌షిప్‌ శ్రేణిలో విడుదలైన ఈ ఫోన్‌ను సగం ధరకు సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తుంది ఫ్లిప్‌కార్ట్‌. మరి, ఆఫర్‌ పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దామా.

ప్రస్తుతం నథింగ్‌ ఫోన్‌ 1 12జీబీ ర్యామ్‌/256జీబీ వేరియంట్‌ ధర ₹ 37,999గా ఉంది. దీనిపై క్యాష్‌బ్యాక్‌/కూపన్‌ పేరుతో ఫ్లిప్‌కార్ట్ ₹5,000 ధర తగ్గింపును ఇస్తుంది. దీంతో ఫోన్‌ ₹ 32,999కి లభిస్తుంది. ఇక పాత ఫోన్‌ ఎక్సేంజ్‌పై గరిష్ఠంగా ₹ 17,500 ధర తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్‌ ఫోన్‌ ఎక్సేంజ్‌ చేసే సమయానికి మోడల్, పనితీరు ఆధారంగా ధర నిర్ణయిస్తారు. దీంతో రెండు ఆఫర్లు కలిపి నథింగ్‌ ఫోన్ 1 ధర కనిష్ఠంగా ₹ 15,499కి తగ్గుతుంది. ఒకవేళ ఎక్సేంజ్‌ ఆఫర్‌లో పాత ఫోన్‌కు తక్కువ ధర లభిస్తే నథింగ్‌ ఫోన్‌1 కొనుగోలు చేసే ధరలో మార్పులుంటాయి. ఇవి కాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేసేవారికి 5 శాతం క్యాష్‌బాక్, డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌పై 25 శాతం డిస్కౌంట్‌తోపాటు, ₹ 6,699 విలువైన గూగుల్ ఆడియోను ఇస్తోంది. 

నథింగ్ ఫోన్‌ 1లో 6.55 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 కూడా ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 778జీ+ ప్రాసెసర్‌ ఉపయోగించారు. వెనుకవైపు రెండు 50 ఎంపీ కెమెరాలున్నాయి. ముందుభాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 8 జీబీ/128 జీబీ, 12 జీబీ/256 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని