Published : 03 Nov 2021 12:11 IST

WhatsApp: వాట్సాప్‌లో మూడు కొత్త ఫీచర్లు.. డెస్క్‌టాప్‌లో ఒకటి, యాప్‌లో రెండు 

ఇంటర్నెట్‌డెస్క్‌: మెసేజింగ్ యాప్ వాట్సాప్ మూడు కొత్త ఫీచర్స్‌ని యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. వీటిలో రెండు మొబైల్‌ వెర్షన్‌లో, మరొకటి డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో తీసుకొస్తున్నట్లు ట్విటర్లో పేర్కొంది. అయితే ఇప్పటికే ఈ ఫీచర్స్ పలువురు యూజర్స్‌కి అందుబాటులోకి రాగా.. తాజా అప్‌డేట్‌లో వాటని పూర్తిస్థాయిలో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. మరి ఆ ఫీచర్లేంటో చూద్దాం. 


డెస్క్‌టాప్‌ ఫొటో ఎడిటర్‌

వాట్సాప్‌ డెస్క్‌టాప్‌లో మనం పంపే ఫొటోలను ఎడిట్‌ చేయాలంటే ప్రత్యేకంగా ఫొటోషాట్ లేదా ఇతర ఫొటో ఎడిటింట్ టూల్స్‌ ఉపయోగించి ఎడిట్‌ చేసి షేర్ చేయాల్సిందే. ఇకమీదట అలాంటి అవసరం లేకుండా డెస్క్‌టాప్‌ వెర్షన్‌లోనే ఫొటో ఎడిట్‌ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది. మనం ఇతరులకు పంపాలనుకున్న ఫొటోను అప్‌లోడ్ చేసిన తర్వాత పేజ్ పై భాగంలో డ్రాయింగ్ టూల్ కనిపిస్తుంది. అందులో మనకి ఎమోజీ, స్టిక్కర్‌, టెక్స్ట్‌, డ్రాయింగ్, క్రాప్‌, రొటేషన్‌ ఆప్షన్లు ఉంటాయి. వాటి సాయంతో మీరు పంపుతున్న ఫొటోలో మార్పులు చేయొచ్చు. అలా వాట్సాప్‌ డెస్క్‌టాప్‌లోనే ఫొటోను ఎడిట్ చేసి పంపే వీలుంటుందని వాట్సాప్‌ వెల్లడించింది.  


లింక్‌ ప్రివ్యూస్‌

యూట్యూబ్‌, ఫేస్‌బుక్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్న వీడియో లేదా చదువుతున్న సమాచారం నచ్చితే దాని లింక్‌ని వాట్సాప్‌లో ఇతరులతో షేర్ చేసుకుంటాం. గతంలో ఈ లింక్ షేర్ చేసినప్పుడు దానికి సంబంధించిన థంబ్‌ సైజ్‌ ఫొటో, లింక్‌, పేరు వంటివి చిన్నగా కనిపించేవి. తాజా అప్‌డేట్‌లో లింక్‌ షేర్ చేస్తే ఫొటో, లింక్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారం మరింత పెద్దదిగా కనిపించేలా మార్పులు చేసినట్లు వాట్సాప్‌ తెలిపింది. దీనివల్ల యూజర్స్ తాము ఎలాంటి సమాచారానికి సంబంధించిన లింక్‌ను క్లిక్ చేస్తున్నామనే దానిపై మరింత అవగాహన ఉంటుందని వాట్సాప్ చెబుతోంది. 


స్టిక్కర్‌ సజెషన్స్‌

స్టిక్కర్‌ సజెషన్స్‌ పేరుతో ఈ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. పరీక్షల దశలో మెసేజ్‌ రియాక్షన్‌గా వాట్సాప్ పేర్కొంది. ఈ ఫీచర్ సాయంతో యూజర్స్‌ వాట్సాప్‌ మెసేజ్‌లకు టెక్స్ట్‌తో కాకుండా స్టిక్కర్‌ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపే వీలుంటుంది. అంటే వాట్సాప్‌లో మనకు వచ్చిన మెసేజ్‌కి రిప్లై ఇచ్చేప్పుడు టెక్స్ట్‌కి బదులు మనలోని భావాన్ని ఎమోజీతో చెప్పొచ్చు. మీకు వచ్చిన మెసేజ్‌కి రిప్లై ఇవ్వటానికి సదరు మెసేజ్‌పై క్లిక్ చేసి రిప్లై ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీకు స్టిక్కర్లతోపాటు టెక్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఒక వేళ మీకు ఎక్కువ స్టిక్కర్లు కనిపించకపోతే.. పక్కనే ఉన్న ప్లస్‌ సింబల్‌పై క్లిక్ చేసి మీకు నచ్చిన స్టిక్కర్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని