WhatsApp Tip: గూగుల్‌ డ్రైవ్‌లో వాట్సాప్‌ బ్యాకప్‌.. ఎలా చేయాలంటే?

యూజర్ల డేటా భద్రత కోసం వాట్సాప్‌ చాట్‌, మీడియా ఫైల్స్‌ను గూగుల్‌ డ్రైవ్‌లోనూ బ్యాకప్‌ చేయవచ్చు. అది ఎలాగే చూద్దాం..

Updated : 21 Apr 2022 14:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త ఫోన్‌కు మారినా, వాడుతున్న ఫోన్‌లో వాట్సాప్ అన్‌ఇన్‌స్టాల్‌ చేసినా ముఖ్యమైన మెసేజ్‌లతో పాటు ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ కోల్పోతుంటాం. ఇలా డేటా కోల్పోకుండా ఎప్పటికప్పుడు సేవ్‌ చేసుకునేలా వాట్సాప్‌లో చాట్‌ బ్యాకప్‌ అనే ఆప్షన్‌ ఉంది. డివైజ్‌తోపాటు, గూగుల్‌ డ్రైవ్‌లోనూ బ్యాకప్‌ అవుతుంది.  దీంతో డేటా కోల్పోయే సమస్య ఉండదు. అది ఎలాగో చూద్దాం!


చాట్‌ బ్యాకప్‌ ఎలా ?

📍 ముందుగా వాట్సాప్‌ ఓపెన్‌ చేసి అందులో మోర్‌ ఆప్షన్స్‌ను ఎంచుకోవాలి.

📍 తర్వాత సెట్టింగ్స్‌పై క్లిక్‌ చేయాలి.

📍 చాట్‌ ఆప్షన్‌ను ఎంచుకొని అందులోని చాట్‌ బ్యాకప్‌ను సెలెక్ట్‌ చేసుకుంటే ఆటోమెటిక్‌గా వాట్సాప్‌ మెసేజెస్‌ బ్యాకప్‌ అయిపోతాయి.



గూగుల్‌ డ్రైవ్‌లోనూ బ్యాకప్‌..

📌 వాట్సాప్‌ ఓపెన్‌ చేసి మోర్‌ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి. 

📌 అందులో సెట్టింగ్స్‌ ఆప్షన్‌ను ఎంచుకొని చాట్‌ బ్యాకప్‌లోని బ్యాకప్‌ టూ గూగుల్‌ డ్రైవ్‌ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి. 

📌 అప్పుడు కొన్ని ఆప్షన్స్‌ కనిపిస్తాయి. నెవర్‌, ఓన్లీ వెన్‌ ఐ ట్యాప్‌ ‘బ్యాకప్‌’, డేలీ, వీక్లీ, మంత్లీ అని చూపిస్తాయి. ఇందులో ఏదీ అవసరమనుకుంటే ఆ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

అయితే, దీనికి కచ్చితంగా గూగుల్‌ అకౌంట్ కనెక్ట్‌ అయ్యి ఉండాలి. లేనిపక్షంలో అకౌంట్‌ యాడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాకప్‌ ఓవర్‌ అనే ఆప్షన్‌ ద్వారా వాట్సాప్‌ చాట్‌ బ్యాకప్‌ ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు? వైఫై ఉన్నప్పుడు/మొబైల్‌ డేటా వినియోగించేటపుడు అనే దాన్ని కూడా మనమే ఎంచుకోవాల్సి  ఉంటుంది.


ఐఓఎస్‌ యూజర్లకు మరో కొత్త అప్‌డేట్‌..

వాట్సాప్‌ తాజాగా ఐఓఎస్‌ యూజర్లకు మరో కొత్త అప్‌డేట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్‌ లాస్ట్‌సీన్‌లో ఉన్న ఎవ్రీవన్‌, మై కాంటాక్ట్స్‌, నోబడీ ఆప్షన్లకు అదనంగా కొత్తగా ‘మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌’ అనే ఆప్షన్‌ను పరిచయం చేయనుంది. ఇప్పటి వరకు వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌, ఫొటో, వీడియో, ఆడియో లేదా డాక్యుమెంట్‌లను చివరగా ఎప్పుడు చూశామనేది ఇతరులు చూడొచ్చు. కొత్తగా తీసుకొస్తున్న మై కాంటాక్ట్ ఎక్సెప్ట్‌ ఆప్షన్‌తో యూజర్‌ అనుమతించిన వారు మాత్రమే లాస్ట్‌సీన్‌ను చూడగలరు. అయితే, ఈ ఫీచర్‌ను ఐఓఎస్‌ 22.9.0.70 వెర్షన్‌ వాడే వాట్సాప్‌ బీటా యూజర్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు వాబీటా ఇన్ఫో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని