భాజపాకు ఎప్పుడూవ్యతిరేకమే: కేకే
భాజపాకు తాము ఎప్పుడూ వ్యతిరేకమేనని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అన్నారు. 12 మంది రాజ్యసభ సభ్యులను సమావేశాల నుంచి సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఆవరణలో చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు.
ఈనాడు, దిల్లీ: భాజపాకు తాము ఎప్పుడూ వ్యతిరేకమేనని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అన్నారు. 12 మంది రాజ్యసభ సభ్యులను సమావేశాల నుంచి సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఆవరణలో చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కొన్ని బిల్లులకు మద్దతు ఇచ్చామని తెలిపారు. తాము గతంలోనూ అంశాల వారీగా విపక్ష నేతలతో పలు సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్‌పై విపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయని, ఈ విషయంలో భాజపా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల అంశంలో విపక్షాలతో కలిసి ఆందోళన చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్