భాజపాతో వైకాపా లాలూచీతో రాష్ట్రానికి నష్టం

‘‘కేంద్ర బడ్జెట్‌ ఆశాజనకంగా లేదు. రాష్ట్ర ప్రజలను పూర్తిగా నిరుత్సాహపర్చింది. రాష్ట్ర డిమాండ్లపై కమిటీ వేశారని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత విస్మరిస్తుందా..? రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల హక్కులను కేంద్రం వద్ద తాకట్టుపెట్టి  మోసం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం

Updated : 02 Feb 2022 04:31 IST

కనకమేడల రవీంద్రకుమార్‌, తెదేపా రాజ్యసభ సభ్యుడు

‘‘కేంద్ర బడ్జెట్‌ ఆశాజనకంగా లేదు. రాష్ట్ర ప్రజలను పూర్తిగా నిరుత్సాహపర్చింది. రాష్ట్ర డిమాండ్లపై కమిటీ వేశారని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత విస్మరిస్తుందా..? రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల హక్కులను కేంద్రం వద్ద తాకట్టుపెట్టి  మోసం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సరెండర్‌ అవడంతోనే బడ్జెట్‌లో నిధుల కేటాయింపు లేదు. భాజపాతో వైకాపా లాలూచీతో రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోంది. రాష్ట్ర ప్రయోజనాలపై వైకాపాకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో పోరాడి రావాల్సినవి సాధించాలి. కేంద్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న పోరాటాన్ని చూసి వైకాపా నేతలు నేర్చుకోవాలి. పోరాడతారా.. పారిపోతారా వారే నిర్ణయించుకోవాలి.’’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని