కేంద్ర విధానాలను ఎండగట్టేందుకు కలిసి రావాలి

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు తమతో కలిసి రావాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. తమ ఉద్యమాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌

Published : 21 Apr 2022 04:56 IST

సీఎంలు కేసీఆర్‌, జగన్‌లకు బీవీ రాఘవులు పిలుపు

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు తమతో కలిసి రావాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. తమ ఉద్యమాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సీఎంలు జగన్‌, కేసీఆర్‌ మద్దతు పలకాలని కోరారు. బుధవారం హైదరాబాద్‌ సుందరయ్య కళానిలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ భాజపా పాలిత రాష్ట్రాలతో ఒక రకంగా, భాజపాయేతర రాష్ట్రాలతో మరో రకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో భాజపా సర్కారు గద్దెనెక్కిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగాయని, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేశారని ఆరోపించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు భాజపా కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. పేదలకు బియ్యం పంపిణీకి బదులు నెలకు రూ.7,500 చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని