‘బీసీ కులగణనకు కేంద్రాన్ని ఒప్పించాలి’

దేశవ్యాప్తంగా త్వరలో చేపట్టబోయే జనగణనలో బీసీ కులగణన కూడా జరగాలని బీసీ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను

Published : 03 Dec 2021 05:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా త్వరలో చేపట్టబోయే జనగణనలో బీసీ కులగణన కూడా జరగాలని బీసీ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను కోరాయి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో బీసీ ప్రతినిధుల బృందం గురువారమిక్కడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన్ను కలిసింది. 13, 14, 15 తేదీల్లో దిల్లీలో జరిగే బీసీ ఉద్యమానికి మద్దతివ్వాలని శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. లక్ష్మణ్‌ స్పందిస్తూ- కేంద్ర ప్రభుత్వం 27 మంది ఓబీసీలకు కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించిందని నవోదయ విద్యాలయాలు, నల్సార్‌ యూనివర్సిటీ, సైనిక పాఠశాలల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించిందని వివరించారు. బీసీ సంఘాల ప్రతినిధి బృందంలో కనకాల శ్యాం, జాజుల లింగం, మాదేశి రాజేందర్‌, గూడూరు భాస్కర్‌, బండిగారి రాజు, నాగరాజు, రాంప్రసాద్‌, సాయిపవన్‌, రాజేశ్‌, సాయితేజ, శివకుమార్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని