
శ్రీశైలం ప్రధాన రహదారిలో పెద్దపులి
నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రధాన రహదారిపై పెద్దపులి కనిపించింది. ఈ విషయాన్ని మన్ననూరు రేంజ్ అటవీ అధికారి ఈశ్వర్ ధ్రువీకరించారు. గుండం ప్రాంతంలో పెద్దపులి సంచరించినట్లు దాని పాదముద్రలు కనిపించాయని సిబ్బంది చెప్పారని వివరించారు. లోతట్టు అటవీ ప్రాంతం మల్లాపూర్ చెంచుపెంటకు చెందిన కొందరు చెంచులు గురువారం హైదరాబాద్ వెళ్లి రాత్రి తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి బస్సులో వస్తుండగా మన్ననూరు దాటిన తర్వాత గుండం అటవీ ప్రాంతంలో పెద్దపులి రహదారి దాటుతూ కనిపించింది. బస్సులోని ఓ వ్యక్తి పెద్దపులి కదలికలను వీడియోలో బంధించాడు. శుక్రవారం ఆ వీడియో స్థానికంగా వైరల్ అయింది.
- న్యూస్టుడే, అమ్రాబాద్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.