TS News: ర్యాపిడో ప్రకటన వీడియో తొలగించండి: యూట్యూబ్‌కి కోర్టు ఆదేశం

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాన్ని కించపరిచేలా ర్యాపిడో సంస్థ ప్రకటన రూపొందించడం సరికాదని సిటీ సివిల్‌ కోర్టు పేర్కొంది. ఆ ప్రకటనలో టీఎస్‌ఆర్టీసీ బస్సును పూర్తిగా

Published : 06 Dec 2021 07:59 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాన్ని కించపరిచేలా ర్యాపిడో సంస్థ ప్రకటన రూపొందించడం సరికాదని సిటీ సివిల్‌ కోర్టు పేర్కొంది. ఆ ప్రకటనలో టీఎస్‌ఆర్టీసీ బస్సును పూర్తిగా తొలగించాలని ర్యాపిడోతోపాటు యూట్యూబ్‌లను ఆదేశించింది. కథానాయకుడు అల్లు అర్జున్‌ నటించిన సదరు వాణిజ్య ప్రకటనను ప్రసారం, ప్రచారం చేయకుండా నిరోధించాలని ఆదేశాలిచ్చింది. ప్రకటన అసలైన, సవరించిన సంస్కరణకు యాక్సెస్‌ను బ్లాక్‌ చేయాలని యూట్యూబ్‌ను న్యాయస్థానం ఆదేశించింది. తమ ఆదేశాలు అమలు చేయకపోతే విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆర్టీసీ ప్రయాణాన్ని అవమానించేలా ర్యాపిడో ప్రకటన ఉందంటూ అల్లు అర్జున్‌కు, ర్యాపిడో సంస్థకు నవంబరు 9న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ లీగల్‌ నోటీసులు పంపారు. ఆ తర్వాత ఆర్టీసీ తరఫున కోర్టులో కేసు ఫైల్‌ అయింది. అభ్యంతరకర దృశ్యాలను, వ్యాఖ్యలను తొలగించామని ర్యాపిడో పేర్కొంది. ఆ వీడియోలో ప్రజారవాణా సంస్థను కించపరిచేలా ఉన్న అంశాలన్నింటినీ తొలగించాలని కోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు కోర్టు శుక్రవారం ఆదేశాలు ఇచ్చిందని టీఎస్‌ఆర్టీసీ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని