AP News: అధికారులకుచుక్కలు చూపించిన పాలకవీడు వాసి

కొవిడ్‌ టీకాల పంపిణీలో భాగంగా ఇంటింటికీ తిరుగుతున్న ఆరోగ్య సిబ్బందికి సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రంలో విచిత్రమైన అనుభవం ఎదురైంది. గ్రామానికి చెందిన కొండా చిన అచ్చయ్య(65) ఇంటికి సోమవారం ఆరోగ్య సిబ్బంది వెళ్లారు.

Updated : 21 Dec 2021 08:07 IST

కొవిడ్‌ టీకాల పంపిణీలో భాగంగా ఇంటింటికీ తిరుగుతున్న ఆరోగ్య సిబ్బందికి సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రంలో విచిత్రమైన అనుభవం ఎదురైంది. గ్రామానికి చెందిన కొండా చిన అచ్చయ్య(65) ఇంటికి సోమవారం ఆరోగ్య సిబ్బంది వెళ్లారు. టీకా వేసుకోబోనని తేల్చిచెప్పిన ఆయన.. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఎంత చెప్పినా వినకపోవడంతో సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఎంపీడీవో జానయ్య, ఎంపీవో దయాకర్‌లు నచ్చజెప్పినా ఆయన లక్ష్యపెట్టకపోవడం, తలుపులు తీయకపోవడంతో ఇంటి ఎదుటే బైఠాయించారు. 40 నిమిషాలపాటు నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో వారంతా వెనుదిరిగారు.

- న్యూస్‌టుడు, పాలకవీడు గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని